అమెరికాను వణికిస్తున్న అప్పు ప్రమాదం?

రాబోయే ఆర్థిక ముప్పు లో ఎక్కువగా ఇబ్బంది పడబోయేది అమెరికా. దాని అదృష్టం డాలర్ బేస్ డ్ ఏకానమీ, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం సందర్భం అమెరికాకు కలిసి వచ్చింది. ఆయిల్ ను ఎక్కువగా వేరే దేశాలకు అమ్మడంతో కాస్త కుదుటపడింది. కానీ అక్కడ ఉద్యోగాలు మాత్రం పోతూనే ఉన్నాయి. ఆదాయానికి కంటే అప్పులు పెరుగుతున్నాయి. టోటల్ గా 36 శాతం ప్రజల క్రెడిట్ కార్డు అప్పులు ఎక్కువయ్యాయి. దాచుకున్న డబ్బుల కంటే క్రెడిట్ కార్డు అప్పులు ఎక్కువయ్యాయని నివేదికలో తేలింది.

ప్రస్తుతం అమెరికాలో ధరల పెరుగుదల విపరీతంగా ఉంది. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. 2021 సంవత్సరంలో అప్పులు 21 శాతం ఉంటే 2022 లో 27 శాతం వరకు పెరిగాయి. డాలర్ వ్యవస్థతో యూరో, పౌండ్ ల వ్యాల్యూ తక్కువగా ఉండటం వల్ల డాలర్ రేట్ పెరిగిపోయి వారికి ఆర్థిక సమస్యలు వచ్చినా కాస్త కుదురుకోవడానికి సమయం పడుతుంది. ప్రస్తుతం అక్కడ తీసుకున్న అప్పులు తీర్చాలంటే చాలా రోజులు పట్టేలా ఉంది. ప్రజల్లో ఆదాయానికి కంటే అప్పులు తీసుకునే వారి సంఖ్య పెరుగుతుంది.

130 బిలియన్ డాలర్ల నుంచి 980 బిలియన్ డాలర్ల వరకు అప్పు చేరుకుంటుంది. ప్రస్తుతం ధరల పెరుగుదలతో క్రెడిట్ కార్డు అప్పులు పోటీ పడే పరిస్థితికి చేరుకున్నాయి. అంటే ఏకంగా 130 బిలయన్ డాలర్ల అప్పుల నుంచి 980 బిలియన్ డాలర్ల వరకు చేరిందంటే ఎలాంటి పరిస్థితి ఉందో అర్ధం చేసుకోవచ్చు. ప్రపంచ దేశాలపై పెత్తనం సాగించాలనుకునే అమెరికాకు ఆర్థిక పరంగా చిక్కులు వస్తే దాని నుంచి బయటపడటం ఎలాగనేది ఇప్పుడు అందరి మదిలో మెదలుతున్న ప్రశ్న.

రష్యా, ఉక్రెయిన్ యుద్దం, అంతర్గతంగా  ఎక్కువ మంది ఉద్యోగాలు పోవడం, ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు పెరగడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అగ్రరాజ్యంలో క్రెడిట్ కార్డు బిల్లులు కట్టలేక సతమతమవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

usa

సంబంధిత వార్తలు: