జగన్‌ను రెచ్చగొడుతున్న ఎల్లో మీడియా?

వచ్చే సంవత్సరం వరకు టీవీలు, పత్రికలు, ఛానళ్లు చూడాలంటే భయం కలిగేలా ఉంది.  ఏ పార్టీకి మద్దతు ఉన్న ఛానళ్లను చూస్తే వారి వార్తలు అనుకూలంగా మిగతా పార్టీలకు వ్యతిరేకంగా రావడం మరింత పెరిగిపోతుంది. అయితే వీరంతా బ్యాలెన్స్ డ్ జర్నలిజాన్ని మరిచిపోయి చాలా కాలమైంది. తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తే టీడీపీ అనుకూల మీడియాలో పూర్తిగా టీడీపీ వార్తలు తప్ప మరేమీ కనిపించడం లేదు. అటు సాక్షి పేపర్ చూస్తే ఆంధ్రలో అద్భుత పాలన కొనసాగుతోంది. ఆహా అంటూ అదరగొట్టే వార్తలు తప్ప ప్రజలకు అవసరమైన వార్తలు కనిపించడం లేదు.

జగన్ ని రెచ్చగొట్టేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నటు వంటి పరిస్థితి. టీడీపీ నాయకులపై మాటల దాడి చేయడంలో కొడాలి నాని గురించి చెప్పనక్కర్లేదు. సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పడం మరిచిపోయి రెచ్చిపోయి ఇరు పక్షాలు తిట్టుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ఎందుకంటే ప్రజల్లోకి వెళ్లాలంటే సంక్షేమ పథకాల గురించి మాట్లాడటం కాదు. గొడవలు జరగాలి. ప్రజల్లోకి వెళ్లి మాతో గొడవ పెట్టుకున్నారు. మమ్మల్ని ఇలా కొడుతున్నారనే వివరాలతో అరాచక పాలన సాగుతోంది. ఇలా అయితే ప్రజల్ని ఏం పట్టించుకుంటారనే విమర్శలు చేస్తూ క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఓట్లను రాబట్టుకోవాలి.

రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం నడిపిస్తున్న నవరత్నాల పథకాన్ని టీడీపీ ప్రభుత్వం వస్తే ఎత్తివేయాలని కోరుకునే అవకాశం ఉంది. ఎందుకంటే జగన్ టీడీపీ హయాంలో ప్రవేశపెట్టిన అన్న క్యాంటీన్లను మూసివేయించారు. ఇలా ఆయా ప్రభుత్వాల హయాంలో ప్రవేశపెట్టిన పథకాల పేర్లను తొలగిస్తున్నారు. ఒకవేళ అవే పేర్లతో పథకాలు  ఉంటే వారికి క్రెడిట్ వస్తుందనే  అభిప్రాయంతో వెంటనే అధికారంలోకి రాగానే వాటిని మార్చేస్తున్నారు.

ఒకరిపై ఒకరు చేసుకుంటున్న తీవ్ర విమర్శలు పరిధి దాటి  దాడులు చేసుకునే వరకు వెళుతున్నారు. దీనికి ఉదాహరణే మొన్నటి గన్నవరం ఘటన. రాబోయే రోజుల్లో గన్నవరం లాంటి ఘటనలు ఏపీలో మరిన్ని జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: