ఆ ఒక్క డైలాగ్‌తో.. బాబు, పవన్‌ నోరు మూయించిన జగన్‌?

జగన్.. పవన్ కు సవాల్ విసురుతున్నారు. దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేయాలని పవన్ కు సీఎం జగన్ బహిరంగంగా సవాల్ విసిరారు. చంద్రబాబుకి కానీ, పవన్ కు కానీ 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ముందా అని సవాల్ విసరడంతో ప్రతిపక్ష పార్టీలు డోలాయమానంలో పడ్డట్లే అనిపిస్తున్నాయి. సీఎం ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో జనసేన, టీడీపీ ఇరుకున పడినట్లే అనిపిస్తోందని బయట రాజకీయ వర్గాల్లో టాక్.

ఒక్క వ్యాఖ్యతో రెండు పార్టీల్లో అంతర్మథనం మొదలైంది. ఆయన విసిరిన సవాల్ ను అంగీకరిస్తే టీడీపీ, జనసేన వేరు వేరుగా పోటీ చేయాలి. లేదు కలిసే పోటీ చేయాలనుకుంటే సీట్లను పంచుకొని 50 స్థానాల వరకు జనసేన, మిగతా స్థానాల్లో టీడీపీ పోటీ చేయాల్సి ఉంటుంది. కానీ జగన్ చేసిన వ్యాఖ్యలు రెండు పార్టీల్లో సంచలనం కలిగిస్తున్నాయి. పోటీ చేస్తే ఒక బాధ, పొత్తు పెట్టుకుంటే మరో బాధ అన్నట్లు తయారైంది.

రెండు వేరు వేరుగా పోటీ చేస్తే ఓట్లు చీలిపోయి మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందనే పొత్తు అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ పొత్తులు లేకుండా దమ్ముంటే 175 స్థానాల్లో మాలా ఒంటరిగా పోటీ చేయాలని అనడంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వేడి రగులుకుంది. ఇది నిజంగా రెండు పార్టీలకు పరీక్ష లాంటిదే కలిసి పోటీ చేస్తే ఒకలా.. వేరు వేరుగా చేస్తే మరోలా అయ్యే అవకాశం ఉంది.

జగన్ చేసిన వ్యాఖ్యలు రెండు పార్టీలను ఇరుకున పెట్టినట్లే పెట్టి, వారు చేతులను వాళ్ల తలపైనే పెట్టేట్లు చేశారు. ఇప్పుడు కలిసి పోటీ చేస్తే 175 స్థానాల్లో కనీసం అభ్యర్థులను కూడా పెట్టుకునే స్థాయి లేనోళ్లు రేపు ప్రభుత్వాన్ని నడిపిస్తారా అంటూ మళ్లీ జగన్ విమర్శలు చేస్తారు. ఏదైమైనా ఒక్క మాటతో రెండు పార్టీల నోళ్లను మాయించినట్లయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: