రష్యా యుద్ధం: చైనా గుట్టు బయటపెట్టిన అమెరికా?

ఉక్రెయిన్, రష్యా యుద్దం మొదలై సంవత్సరం దాటిపోయింది. అయితే రష్యాపై అమెరికా ఎన్నో ఆంక్షలు విధించింది. ఎన్ని ఇబ్బందులు పెట్టినా రష్యా మాత్రం యుద్ధం నుంచి వెనక్కి తగ్గకుండా దాడులు చేస్తూనే ఉంది. అయితే ఇక్కడొక విషయం బయటపడింది. రష్యాకు రహస్యంగా చైనా తన ఆయుధాలను చేరవేస్తున్నట్లు అమెరికా కనిపెట్టింది. పూర్తి ఆధారాలతో సహా బయటపెట్టింది.

చైనా చేస్తున్న నాటకాన్ని అమెరికా బయటపెట్టినా దాన్ని చైనా తోసిపుచ్చింది. చైనా నిదానంగా రష్యాకు ఆయుధాలను అమ్ముతోంది. పాక్ ఎవరికీ తెలియకుండా ఉక్రెయిన్ కు అమ్ముతోంది. చైనా రష్యాకు అమ్మిన ఆయుధాలు ఏమిటంటే 100 కిల్లర్ డ్రోన్లు, 1000 దాకా కామికోజి డ్రోన్లు, 50 కిలోల పేలుడు పదార్ధాలు మోసుకుపోయే డ్రోన్లు, రెండో ప్రపంచ యుద్ధంలో కామికాజీ డ్రోన్లు ఉండేవి. అంటే పేలుడు పదార్థాలను మోసుకుపోయి శత్రు దేశాల్లో బాంబులతో ఆత్మహుతి దాడులు చేసే జర్మన్ విమానాలనే కామికోజి డ్రోన్లు అని అంటారు. అప్పుడు విమానాలతో చేసే వారు కానీ ఇప్పుడు డ్రోన్లతో చేస్తున్నారు.

షియాన్ వింగో ఇంటిలిజెంట్ ఏవియేషన్ టెక్నాలజీ అనే పేరుతో వార్ హెడ్స్ తో కూడిన ఆయుధాలను వేరు వేరుగా విడదీసి రష్యాకు చైనా ఎగుమతి చేస్తోంది. అయితే వీటిని రష్యాకు వెళ్లిన తర్వాత ఫిక్స్ చేసుకొని డ్రోన్లుగా మార్చి యుద్ధరంగంలో పోరాటం చేయవచ్చు. ఈ విధంగా చైనా రష్యాకు సాయం చేసిందని అమెరికా ఆధారాలతో సహా నిరూపించింది. ఇలాంటి విధానాల వల్ల తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ హెచ్చరించారు.

ఏడాది నుంచి రష్యా యుద్దం చేస్తున్నా ఇప్పటివరకు ఆయుధ కొరత ఎందుకు రావడం లేదని అందరూ అనుకుంటున్నారు. కానీ తెర వెనకాల చైనా ఆయుధాలను సరఫరా చేస్తున్నట్లు ఇప్పటి వరకు ఎవరికీ తెలియకపోవడం విచిత్రం. అమెరికాకు వ్యతిరేకంగా చైనా ప్రవర్తిస్తున్న విధానంపై అగ్రరాజ్యం రాబోయే రోజుల్లో ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: