కట్నం కూడా ఆస్తి లెక్కలోకే వస్తుందట?

మహిళలకు సమాన ఆస్తి హక్కు గతంలో ఉండేది. పెళ్లై ఆడపిల్ల అత్తాగారింటికి వెళ్లిన తర్వాత భర్తతో వేరే కాపురం పెట్టినప్పుడు సొంత ఆస్తి వస్తుంది. కాబట్టి భార్యకు కూడా అందులో భాగం ఉంటుంది. అందువల్ల తల్లిగారింటి నుంచి ఆస్తిలో వాటా ఎందుకు అనే ప్రస్తావన వచ్చేది. గతంలో ఉమ్మడి కుటుంబాలు కాబట్టి అసలు సమస్య ఉండేది. ఇప్పుడు వ్యక్తి కుటుంబాలు అంటే చిన్న కుటుంబాలు నలుగురు కలిసి ఉండేవి ఉండటంతో ఆస్తి హక్కు గురించి వివాదాలు వస్తున్నాయి.

గతంలో కన్యాశుల్కం పోయింది. వరకట్నం వచ్చింది. ఆస్తి హక్కు కోరుతున్నవారి గురించి కోర్టు ఒక తీర్పు ఇచ్చింది. అదేమిటంటే ఒక అమ్మాయి తన సోదరుడు నుంచి ఆస్తి కావాలని కోరింది. తల్లిదండ్రులు 50 శాతం ఇవ్వడానికి ఇష్టపడలేదు. అల్రడీ కట్నం ఇచ్చాం కదా కట్నం పోను మిగతాది ఇస్తాం అని తల్లిదండ్రులు అన్నారు. దానికి కోర్టు కూడా ఒప్పుకుంది. వరకట్నం గురించి కోర్టు ఓకే అనడం ఇక్కడ కాస్త విచిత్రంగా కనిస్తుంది.

కుటుంబ ఆస్తుల పంపకాల్లో కర్ణాటకలోని ఒక కోర్టు విచిత్రమైన తీర్పు ఇచ్చింది. బెంగుళూరు కు చెందిన ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్ కు సంబంధించి న్యాయమూర్తి సూరత్ గోవిందరాజు ఒక సంచలన తీర్పు ఇచ్చారు. వరకట్నంగా తీసుకున్న మొత్తాన్ని ఆస్తి పంచే వేళలో పరిగణలోకి తీసుకోవాల్సిందేనని తీర్పు వెలువరించింది. అయితే అవిభక్త కుటుంబంలో పుట్టిన కుమార్తె ఆస్తి కోరితే మాత్రమే ఇది వర్తిస్తుందని కోర్టు చెప్పింది. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు సమంజసమైనదేనని బయట అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి

గతంలో వరకట్నం తీసుకోవడం నిషేధం. కానీ కోర్టు ఇచ్చిన తీర్పులో వరకట్నం కూడా ఆస్తిలో భాగమవుతుందని చెప్పడం ఇక్కడ కొసమెరుపు. వరకట్నం తీసుకున్న వారిపై కేసులు పెడుతున్న సమయంలో వరకట్నం ఆస్తి హక్కులో ఒక భాగమని దాన్ని కూడా లెక్కలోకి తీసుకోవచ్చని కోర్టు సంచలన తీర్పును వెలువరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: