అణుబాంబుతో ఆ దేశాలను వణికిస్తున్న రష్యా?

చిన్న చిన్న సంఘటనలే భారీ సంఘటనలకు కారణం అవుతాయి. మొదటి ప్రపంచ యుద్ధానికి, రెండో ప్రపంచ యుద్ధానికి కారణాలు చిన్నవే. కానీ చినికి చినికి గాలి వానగా మారాయి.  పాండవులు కేవలం అయిదు గ్రామాలు అడిగితే కౌరవులు ఇవ్వలేదు. అది మహాభారత యుద్ధానికి కారణమైంది. చిన్న విషయాలు ఇంతింతై వటుడింతై అన్నట్లు పెద్ద యుద్ధాలుగా మారాతాయి.

ప్రస్తుతం అదే బాటలో కొనసాగుతోంది రష్యా, ఉక్రెయిన్ యుద్ధం. ఈ యుద్దం ప్రారంభమై ఏడాది దాటిపోయింది. ఇప్పుడు ఇదే విషయంలో నాటో దేశాలు వణికిపోతున్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ అణు నిరాయుధీకరణ ఒప్పందంపై సంతకం పెట్టేది లేదని బయటకి వచ్చేశాడు. ఇన్నాళ్లు ఆ ఒప్పందం ఉంది కాబట్టి అణు దాడి చేయడానికి రష్యా వెనకడుగు వేసింది. ఇప్పుడు ఈ విషయంపై నాటో దేశాలు అణు యుద్ధం వస్తుందేమోనని ఉలికి పడుతున్నాయి.

అణ్వాయుధాలను ప్రయోగించకూడదన్న ఒప్పందంపై రష్యా సంతకం పెట్టనని చెప్పడం. వాటిని ఏ దేశంపై కూడా ప్రయోగించకూడదన్న నిబంధనలను పట్టించుకోకపోవడంతో రష్యా ఇప్పుడు అందరినీ బెంబెలెత్తిస్తోంది. ఇన్ని రోజులు ఉక్రెయిన్ కు సహకరించిన యూరప్ నాటో దేశాలు ఇప్పుడు బిక్కుబిక్కు మనే పరిస్థితి తలెత్తింది. రాబోయే రోజుల్లో రష్యా ఉక్రెయిన్ పై దాడులను తీవ్రతరం చేస్తుంది. అప్పుడు ఇప్పటి వరకు మద్దతిచ్చిన దేశాలు  అప్పుడు సపోర్టు చేస్తే రష్యా ఏ విధంగా స్పందిస్తుందనేది ఇప్పుడు చర్చనీయాంశం.

అమెరికా అండ చూసుకుని ఉక్రెయిన్, నాటో దేశాలు ఇప్పటివరకు రష్యాను ఏకాకిని చేయాలని భావించాయి. ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతీయాలని ప్రయత్నించాయి. రష్యాతో పరోక్షంగా ఆయా  దేశాలు యుద్ధం చేశాయని చెప్పొచ్చు. కానీ రష్యా రూటు మార్చింది. ఇప్పుడు అది చేయబోయే దాడులను తలుచుకుంటే నాటో దేశాల్లో వణుకు పుడుతుంది. నాటో దేశాలు అణు దాడి నుంచి తప్పించుకునేందుకు రష్యా దారికి వస్తాయా? లేక అమెరికా మాటలు నమ్మి నట్టేట మునుగుతాయా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: