తన్నుకు చస్తున్న పాకిస్తాన్‌, ఆప్ఘనిస్తాన్‌?

పాకిస్థాన్ లోని వివిధ ప్రాంతాల్లో తెహ్రీక్ ఏ తాలిబాన్ల దాడులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా పాక్ సైనికులకు, తెహ్రీక్ ఏ తాలిబాన్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. కానీ పాక్ ప్రభుత్వం మాత్రం శాంతి యుతంగానే సంప్రదింపులు జరుపుతున్నట్లు చెబుతోంది. అయితే పాకిస్థాన్ తమదిగా చెప్పుకుంటున్న కైబర్ పంక్తువాలో ఆప్గన్ సైనికులకు, పాకిస్థాన్ సైనికులకు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఇరు దేశాల సరిహద్దులో తీవ్రంగా కాల్పులు చోటు చేసుకున్నాయి.

అక్కడ విధులు నిర్వర్తించే పాక్ సైనికుడు ఒకరు ఇటీవల తీవ్రంగా గాయపడి మరణించినట్లు తెలుస్తోంది. ఈ సరిహద్దు వివాదం ముదిరి పాకాన పడుతోంది. కైబర్ ప్రాంతం ఆప్గన్ లో అంతర్భాగమని తాలిబాన్లు చెబుతున్నారు. డ్యూమండ్ రేఖ ను నిర్ణయించడానికి బ్రిటిష్ వారు ఏవరని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రాంతం పూర్తిగా ఆఫ్గన్ కు చెందినదేనని అస్సలు ఈ ప్రాంతాన్ని విడిచి పెట్టే ప్రసక్తే లేదని అంటున్నారు.

ఈ ప్రాంతంలో పాక్ సైనికులకు, తెహ్రీక్ ఏ తాలిబాన్లకు మధ్య కాల్పులు  జరిగాయి. ఇందులో పాక్ జవాన్ మరణించడంతో పాక్ సైనికులు తాలిబాన్ల దాడిని తట్టుకునేందుకు వేరే ప్రాంతాలకు వెళ్లి దాక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాక్ ప్రభుత్వానికి అక్కడి జవాన్లు కాపాడాలని మొర పెట్టుకుంటున్నారు. ఈ ప్రాంతంలో తాలిబాన్ల దాడి ఎక్కువయింది. ప్రభుత్వం చర్చల పేరుతో మాట్లాడాలనుకుంటోంది. కానీ అక్కడ ఉన్న తాలిబాన్ల ప్రభుత్వం ఏ మాత్రం లెక్క చేయకుండా ఇష్టారీతిన దాడులు చేస్తూనే ఉంది. దీంతో ఇప్పటికే చాలా మంది పాకిస్థాన్ సైనికులు గాయపడ్డారు.

ఇప్పటివరకు ఆఫ్గన్ లో అంతర్గతంగా దాడులు జరిగేవి. ప్రస్తుతం అవి పాకిస్థాన్ సరిహద్దు వద్ద జరుగుతున్నాయి. ఆఫ్గన్ లోని తాలిబాన్ల ప్రభుత్వం పాక్ సైనికులను టార్గెట్ చేసుకొని కాల్పులు జరుపుతోంది. పాక్ అధికారుల మాటలు తాలిబాన్లు ఏ మాత్రం లెక్క చేయడం లేదు. మరి పాక్, ఆప్గన్ ల మధ్య ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: