తాలిబన్ల దెబ్బ.. మన విజయవాడపై ఇలా ఉందా?

విజయవాడ అడ్రస్ తో గుజరాత్ పోర్టులో దొరికిన పార్సల్ చెన్నై కేంద్రంగా కార్యాకలాపాలు జరగుతున్నాయని గతంలోనే తెలిసింది. అక్కడ దొరికింది డ్రగ్స్ అని అవి విచ్చలవిడిగా బెజవాడకు రావడానికి మీరంటే మీరు కారణమని రాజకీయ పార్టీలు విమర్శలు చేసుకున్నాయి. అదే ఇది తీవ్రవాద వ్యవహారం అని ప్రస్తుతం ఎన్ఐఏ దర్యాప్తులో చేరింది. దీనిపై ఎన్ఐఏ ఛార్జీషీటు దాఖలు చేసింది. గుజరాత్ లో అదానీ కంపెనీలకు చెందిన ముంద్రా పోర్టులో దొరికిన డ్రగ్స్ తాలిబాన్లు పంపిస్తున్నట్లుగా తేలింది.

తాలిబాన్ల నుంచి పాకిస్థాన్ కు అక్కడి నుంచి గుజరాత్ పోర్టకు తదనంతరం విజయవాడకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. దీన్ని నడిపిస్తుంది మాత్రం చెన్నై నుంచి అని ఎన్ఐఏ రిపోర్టులో పేర్కొంది. ఈ ఎన్ఐఏ రిపోర్టు 22 మందిపై కేసు నమోదు చేసినట్లు ఛార్జీషీటులో పేర్కొన్నారు. అయితే ఇక్కడకు తాలిబాన్లకు ఏమిటి సంబంధం, విజయవాడలో డ్రగ్స్ వాడకానికి తాలిబాన్లు పంపిస్తుంటే పోలీసులు వైఫల్యం అయినట్లే లెక్క.

హెరాయిన్ ను పాకిస్థాన్ నుంచి లష్కర్ ఏ తోయిబే అనే ఉగ్రవాద సంస్థ పంపిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అసలు విషయం పాకిస్థాన్ స్మగ్లర్లు తాలిబాన్ల నుంచి హెరాయిన్ ను కొని దాన్ని ఇండియాకు పంపిస్తున్నట్లు తెలుస్తోంది. విజయవాడలో ఎంతమంది యువకులు డ్రగ్స్ కు అలవాటు అయ్యారు. డ్రగ్స్ వాడుతున్న వారి వివరాలు పోలీసులు సేకరించాలి.

ఇప్పటివరకు విజయవాడకు పాకిస్థాన్ నుంచి ఎన్ని సార్లు పార్సిల్స్ వచ్చాయి. ఎంతమందికి చేరాయి. ఎవరెవరికి తాలిబాన్లు, పాకిస్థాన్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయి. వారు పాకిస్థాన్ స్మగ్లర్లతో ఎలా సంప్రదింపులు జరుపుతున్నారు. చెన్నైలో ఉన్న వారు ఏ రకంగా దీన్నినడిపించారు. వీరికి ఎక్కడ పరిచయం అయింది. ఇంకెంత మందికి తాలిబాన్లు, పాకిస్థాన్ తో మాట్లాడుతున్నారనే వివరాలు సేకరించాలి. ఏ రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, ఈ విషయంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నా, వాడుతున్న వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: