కాశ్మీర్ టెర్రరిస్టుల చేతుల్లో ఉక్రెయిన్‌ మారణాయుధాలు?

అమెరికా, యూరప్ దేశాలు ఉక్రెయిన్ కు ఆయుధాలు ఇస్తున్నాయి. వీటిని పూర్తిగా వినియోగించకుండా వాటిని కొంతమందికి అమ్మేసుకుంటున్నారు. ఉక్రెయిన్ దేశం పాకిస్థాన్‌కు, ఆఫ్గాన్ కు ఆయుధాలను అమ్మేస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. ఇదే విషయంలో పాకిస్థాన్ కు అమ్మిన ఆయుధాలు ఇప్పడు కాశ్మీర్ తీవ్రవాదుల చేతుల్లోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ వాటిని కొనుక్కొని ఆ ఆయుధాలను ఇప్పుడు కాశ్మీర్ తీవ్ర వాదులకు అమ్మేసిందని తెలుస్తోంది.

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కాస్త చినికి చినికి గాలి వానగా మారి తీవ్ర యుద్ధంగా మారడమే కాక ప్రపంచంలోని తీవ్రవాదులకు ఆయుధాలను అందించే ఒక అస్త్రంలా తయారవడం దురదృష్టకరం. అయితే ఇజ్రాయిల్ వాడే అత్యాధునికమైన ఆయుధాలు కాశ్మీర్ లోని తీవ్ర వాదులకు అందినట్లు జమ్మూ కాశ్మీర్ లోని పోలీసులు చెబుతున్నారు. అత్యంత అధునాతమైన ఫిస్టల్స్, గన్స్ వారికి అందాయని అవి చాలా దూరం నుంచి టార్గెట్ ను ఛేదించే ఆయుధాలు అని చెప్పారు. అయితే ఇలాంటి ఆయుధాలు ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో మాత్రమే వాడారని అవి ఇక్కడికి ఎలా వచ్చాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

పాకిస్థాన్ లోని ఉగ్రవాదులు ముందుగా ఉక్రెయిన్ నుంచి ఈ ఆయుధాలను కొనుగోలు చేసి వాటిని కాశ్మీర్ లో ఉన్న తీవ్రవాదులకు అందజేసినట్లు తెలుస్తోంది. అయితే ఇలాంటి అధునాతనమైన ఆయుధాలు తీవ్రవాదులకు చిక్కడం దారుణం. ఇలాంటి ఆయుధాలు తీవ్రవాదుల చేతుల్లో పడ్డాయంటే అక్కడి పోలీసులు, ఆర్మీ కచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన తరుణమిది.

ఉక్రెయిన్ కు అమెరికా, యూరప్ దేశాలు ఎక్కువగా ఆయుధాలను అందజేస్తున్నాయి. ఇవి అక్రమ మార్గంలో పాక్ కు చేరుతున్నట్లు తెలుస్తోంది. ఇలాగే ప్రపంచ దేశాల్లోని వివిధ ప్రాంతాలకు చేరితే అప్పుడు జరగబోయే నష్టం ఊహకందదు. కాబట్టి అమెరికా ఉక్రయిన్ కు ఇస్తున్న ఆయుధాల లెక్క కచ్చితంగా చెప్పమని అడగాలి. వాటిని ఎక్కడెక్కడ ప్రయోగిస్తున్నారు.  ఎన్ని డామేజ్‌ అయ్యాయో తెలుసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: