షాకింగ్‌: 5000 ఏళ్ళ క్రితమే బార్.. బీర్‌?

మనకు తెలిసి మనం చూస్తున్న ఈ రెస్టారెంట్లు, బార్లు, హోటల్స్ అనేవి మొదలుపెట్టి మహా అయితే 100 ఏళ్ళు లేదా ఇంకొంచెం ముందు మొదలయ్యాయి అనుకుంటాం. కానీ 5000 ఏళ్ళ క్రితమే రెస్టారెంట్లు, బార్లు ఉన్నాయంట, అది కూడా మన దగ్గర కాదు ముస్లిం దేశాలైన అరబ్ దేశాల్లో ఉన్నాయంట. ఆ విషయం తాజాగా జరిగిన తవ్వకాల్లో బయటపడింది.

అరబ్ దేశమైన ఇరాక్ లో తవ్వకాల్లో తాజాగా బయటపడిన ఒక బార్ సంచలనం సృష్టిస్తుంది. ఇరాక్ లో పురావస్తు శాస్త్రవేత్తల తవ్వకాలలో 5000 ఏళ్ల నాటి ఒక రెస్టారెంట్ బయటపడింది. ఆ రెస్టారెంట్లో బెంచీలుతో పాటు ఆహారంతో ఉన్న కొన్ని పాత్రలు కూడా కనిపించాయట. అన్నిటికన్నా విచిత్రంగా "జీర్" అని పిలిచే మన ఫ్రిడ్జ్ ని పోలిన ఒక మట్టి రిఫ్రిజిరేటర్ బయటపడిందట. శాస్త్రవేత్తలు ఇప్పుడు ఈ బార్ ని చూసి ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. శాస్త్రవేత్తలు నేలమాళిగల్లోని దొరికిన ఈ ఫ్రిజ్లో బీర్లు కూడా దాచి ఉంచడం చూసి శాస్త్రవేత్తలు మరింత ఆశ్చర్యానికి లోనవుతున్నారట.

మామూలుగా ఎలాగైతే వైన్ ని డ్రమ్ముల్లో వేసి దాచి ఉంచుతారో, అలాగ నేలమాలికల్లోని ఈ మట్టి రిఫ్రిజిరేటర్ లో వైన్ ని దాచి ఉంచారట. పల్లెటూర్లలో ఇదివరకు బియ్యం కొట్టడానికి పెద్ద పెద్దవి ఇలాగే ఏర్పాటు చేసేవారు. కొంతమంది అయితే ఇంటి బయట పెద్ద భోషాణంలా ఏర్పాటు చేసి అందులో బియ్యం పోసి ఉంచేవారు. ఇలాగే పూర్వకాలంలో భూమాళిగల్లో రాజులు, రాణులు వారి ఆభరణాలు, వారి కాలానికి సంబంధించిన నాణాలు, వివిధ రకాల వస్తువులు ఇలానే దాచేవారు.

వాటిలాగే ఇప్పుడు ఏనాడో దాచిన బీర్లు కూడా ఇలాగే బయటపడినాయి అని తెలుస్తుంది. అలాగే పురాతన బీర్లు తయారు చేసే ఒక రెసిపీని కూడా ఆ మట్టి రిఫ్రిజిరేటర్ లోనే కనుక్కున్నారట. ఇవి బయటపడ్డాక ఇంకా ఎన్నాళ్ళ క్రితం ఇలాంటివి ఉన్నాయని ఒక కొత్త ప్రశ్న శాస్త్రవేత్తల్లో తలెత్తుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

BAR

సంబంధిత వార్తలు: