బాబోయ్.. ప్రపంచానికి పెనుముప్పు పొంచి ఉందా?
ప్రపంచం మొత్తం మీద 71 శాతం నీరు, 29 శాతం భూమి మాత్రమే ఉంటుంది. అయితే మంచు ఖండాలు అనేవి మానవాళిని ఏ విధంగా రక్షిస్తున్నాయో అందరికీ తెలిసిన విషయమే. అయితే విపరీతమైన వేడి, వాతావరణ కాలుష్యం వల్ల అంటార్కిటికా ఖండంలోని మంచు పర్వతాలు కరుగుతున్నాయి. తాజాగా వరల్డ్ మెటాలాజికల్ ఆర్గనైజేషన్ ఒక ప్రకటన వెలువరించింది.
మళ్లీ 19 ఏళ్ల క్రితం జరిగిన పరిస్థితి ప్రస్తుతం వచ్చేలా ఉందని ప్రకటించింది. మంచు కొండలు కొంచెం కొంచెంగా కరుగుతున్నాయి. వీటి వల్ల భూభాగం రోజు రోజుకు కుచించుకుపోతుంది. నీటి శాతం పెరిగి భూమి కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సునామీ, ఉప్పెన లాంటివి వచ్చినప్పుడే ప్రజలు తట్టుకోలేరు. చెట్లను నరకడం, వాహనాల వల్ల పెరుగుతున్న వాయు కాలుష్యం వల్ల తీవ్రంగా మంచు పర్వతాలు కరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలోని మేధావులు ఆలోచన చేయాలి.
మంచు పర్వతాలు కరగకుండా ఎలాంటి వాతావరణ పరిస్థితులు కల్పించాలి. ప్రపంచ దేశాల్లో పర్యావరణ రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చ జరగాలి. సరైన మార్గాలు వెతికి అంటార్కిటికా ఖండంలో ఉన్న మంచు పర్వతాలు కరగకుండా చేయాలి. ఇలాగే కరిగితే భూమి అనేది వెతుకుదామంటే దొరకని పరిస్థితి ఉంటుంది.