అదానీ పతనం వెనుక.. విదేశీ శక్తుల కుట్ర?

భారత దేశ ఎదుగుదలను, ఇక్కడి ఇన్వెస్టర్ల విజయాన్ని తట్టుకోలేని విదేశీయులు ఎంతో మంది ఉంటారు. అదానీ వ్యవహారం, హిండెన్ బర్గ్ కథనాలు, బీబీసీ రెచ్చగొట్టే ప్రసారాలు దేశంలో ఆర్థికంగా బలమవుతున్న వ్యవస్థల్ని కిందకు దిగజార్చి కోలుకోలేకుండా చేయడమే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చన్న వాదన ఉంది.

సీనియర్ మిలీటరీ ఎక్స్ పర్ట్ కథనం మేరకు హిండెన్ బర్గ్ అదానీ మధ్య మొదలైన వివాదానికి కారణం.. అదాని గ్రూపు సంస్థ అండమాన్ నికోబార్ దీవుల్లో కంటైనర్ టెర్మినల్ కోసం బిడ్ దాఖలు చేసింది.  కేంద్రంలోని బీజేపీ గవర్నమెంట్ ప్రపంచంలోనే అత్యంత బీజీగా ఉండే మెగా కంటైనర్ టెర్మినల్ ను గ్రేటర్ నికోబార్ దీవుల్లో నిర్మించేందుకు తలపెట్టింది. దీన్ని నిర్మించడానికి అదానీ సంస్థ ముందుకొచ్చింది. ఇక్కడే అసలు వివాదం మొదలైంది.

ఇది భారత్ కు ఒక గేమ్ చేంజర్ లా మారుతుంది. ఇక్కడ ఈ ప్రాజెక్టును నిర్మించడం వల్ల ఇండియానే కాకుండా సౌత్ ఎసియాన్ కంట్రీలతో కూడా వ్యాపారం జరపడానికి వాటిని మన అదుపులో ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇండోనేషియా, థాయ్ లాండ్, కంబోడియా, వియత్నాం మలేషియా, లాంటి దేశాలు మనం చెప్పినట్లు వినాల్సి వచ్చేది. ఇంకా హిందూ మహా సముద్రంలో భారత్ కు మంచి పట్టు దొరికేది.

ఈ టెర్మినల్ నిర్మాణం జరిగినట్లయితే విదేశాలకు ఇక్కడి నుంచే ఏడాదిలో దాదాపు 70 నుంచి 75 శాతం వరకు సరకుల రవాణాకు అవకాశం ఏర్పడుతుంది. ఇండియన్ పొలిటిక్సే కాదు ఇంటర్నేషనల్ పొలిటిక్స్, అండ్ గ్లోబల్ మీడియా చేసిన విష ప్రచారంతో అదానీ సంస్థలు తీవ్రంగా నష్టపోయాయి. అదానీ హిండెన్ బర్గ్ వ్యవహారం వెనక జార్జ్ సోరోస్ వర్గం ఉన్నట్లు తెలుస్తోంది. అదానీ పై జరిగిన కుట్రలకు కారణం విదేశీ శక్తులు అని తెలిసిపోయింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇండియా స్టాక్ మార్కెట్, వ్యాపార దిగ్గజాలపై ఎలాంటి కుయుక్తులు చేయనున్నారో ముందుగానే పసిగట్టాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: