రష్యా ధాటికి ఉక్కిరిబిక్కిరవుతున్న ఉక్రెయిన్‌?

అమెరికా, యూరప్ దేశాలు ఇస్తామని చెప్పిన యుద్ధ ట్యాంకులు ఇవ్వకపోవడంతో ఉక్రెయిన్ యుద్ధంలో వెనకబడి పోతోంది. ఉక్రెయిన్ సైన్యం వెనకడుగు వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. జర్మనీ, పోలండ్, అమెరికా నుంచి ఆయుధాలు, ఆయుధ సామగ్రి రావడానికి సమయం పట్టే అవకాశం ఉంది. ఈ లోపు రష్యా ఉక్రెయిన్ పై విరుచుకుపడుతోంది.

ఉక్రెయిన్ ఫ్రంట్ లైన్ సైన్యం రోజుకు రెండు కిలోమీటర్ల చొప్పున వెనక్కు వెళ్లిపోతున్నారు. రష్యా రోజు కొంత భూభాగాన్ని ఆక్రమించుకుంటూ దూసుకువస్తోంది. రష్యా ప్రస్తుతం ఉక్రెయిన్ పై భూమి, సముద్రం, ఆకాశం మూడు ప్రాంతాల నుంచి ఉక్రెయిన్ బలగాలపై ఆయుధాలతో విరుచుకుపడుతున్నాయి.

దాదాపుగా పవర్ స్టేషన్లు, వార్ షిప్లు, ఇండస్ట్రీయల్ కాంప్లెక్సులు, ఇలా ప్రతి చోట రష్యా భీకరమైన దాడులు చేస్తోంది. ఇంత జరుగుతున్నా రష్యా తాము చర్చలకు సిద్ధమంటోంది. కానీ ఉక్రెయిన్ మాత్రం తాము చర్చలకు సిద్ధంగా లేము యుద్ధం చేస్తామని గొప్పలకు పోతూనే వెనకడుగు వేస్తోంది. గతంలో చేసిన దాడుల కంటే భీకర మైన దాడులకు పాల్పడుతోంది రష్యా.

ఇంత జరుగుతున్న ఇప్పటివరకు అందిస్తామని చెప్పినా ఆయుధాలను అమెరికా, జర్మనీ ఉక్రెయిన్ కు అందించడంలో విఫలమవుతోంది. ఇప్పటికి ఇంకా ఉత్పత్తి దశలోనే ఉన్నామని చెబుతున్నారు. రష్యా దాడుల్ని తట్టుకోలేక ఉక్రెయిన్ సైన్యం వెనకడుగు వేస్తున్నా అధికారులు మాత్రం యుద్ధం చేయాల్సిందేనని అంటున్నారు. పోరాడేందుకు సైన్యానికి, కావాల్సిన ఆయుధాలు, యుద్ధ ట్యాంకులు, మిస్సైల్స్ లేవు. కానీ రష్యాను ఎలాగైనా ఓడిస్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడు చెబుతున్నారు.  

నాటో దేశాల మద్దతు ఉందని విర్రవీగుతున్న జెలెన్ స్కీకి ఇప్పటికీ తన దేశ  పరిస్థితి ఇంకా ఆయనకు అర్థం కావడం లేదు. యూరప్ దేశాలను నమ్ముకుని యుద్ధంలో ముందుకెళితే పూర్తిగా నాశనం అయ్యేది ఉక్రెయిన్ మాత్రమే. అమెరికా, జర్మనీ, నాటో దేశాలు ఆయుధాలను, యుద్ధ ట్యాంకుల్ని అందించి ఉక్రెయిన్ ను ఆదుకుంటాయా లేదా అనేది మరి కొన్ని రోజుల్లో తేలనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: