హైడ్రోజన్ ట్రక్స్.. భారత్‌ దశ మార్చేస్తాయా?

బెంగళూరులో ఇటీవల జరిగిన ఎనర్జీ వీక్ లో భారత దేశ మొట్ట మొదటి హైడ్రోజన్ వెహికల్ ను ప్రదర్శించారు. ఇది పూర్తిగా హైడ్రోజన్ తో నడిచే ట్రక్ ఇది. దీనికి పెట్రోల్, డిజీల్ ను వాడనవసరం లేదు. ఇది సరకుల రవాణా చేయడానికి పనికొస్తుంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా సరికొత్త విప్లవం అని చెప్పొచ్చు. ఇది భారతదేశంలో తయారైన వెహికల్ కాబట్టి దీనికి డిమాండ్ ఉంటుందనడంలో సందేహం లేదు.

అయితే ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకుంటే దేశంలో ఉత్తరాల ద్వారా సందేశం ఇచ్చుకునే వారు. ఉత్తరం చేరడానికి వారం రోజులు, నెల, రెండు నెలల సమయం పట్టేది. ఒక విషయాన్ని ఒకరి నుంచి మరొకరికి దూరంలో ఉన్న వ్యక్తికి సమాచారం చేరాలంటే కొన్ని నెలల సమయం తీసుకునేది. కానీ అప్పుడదే గొప్ప విషయం కాలంతో పాటు మనం రాసిన విషయం ఒకరికి చేరుతుందంటే ఎంతో సంతోషపడేవాళ్లం.

దాని తర్వాత టెలిఫోన్లు, ఆ తర్వాత సెల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు, వీడియో కాల్స్ ఇలా ఒకదాని అనంతరం మరో కొత్త విషయం నేర్చుకుంటూనే దాన్ని తయారు చేస్తూ ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ సమాచారాన్ని, సాంకేతికతను సొంతం చేసుకుంటున్నాం. ప్రస్తుతం ఇదే తరహాలో ఒకప్పుడు మనిషి దూరం వెళ్లాలంటే ఎడ్లబండి, అనంతరం  సైకిల్, తర్వాత కారు, బస్సు, లారీ ఇలా ఒక్కటేమిటి వీటన్నింటిని తయారు చేసుకుని అవి నడపడానికి పెట్రోల్, డిజీల్ వాడుతున్నాం.  పెట్రోల్, డిజీల్ అనేది కొన్ని గల్ప్ దేశాల్లోనే దొరుకుతుంది.

దీన్నికొనడానికి ఏటా కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు. కాబట్టి ఇండియాలో తయారైన హైడ్రోజన్ ట్రక్ వల్ల కాలుష్య నివారణ జరుగుతుంది. పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ఇది ఎంతో దోహదపడుతుంది. హైడ్రోజన్ ట్రక్కు అనంతరం ఇంకా ఎలాంటి వాహనాలు తయారవుతాయో ఎంతమందికి ఇవి చేరవవుతాయో చూడాలి. రాబోయే కాలంలో హైడ్రోజన్ తో నడిచే కార్లు, బైక్ వస్తే ఎంత బాగుంటుందోనని చాలా మంది వేచి చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: