నారా భువనేశ్వరే మహిళా.. వైఎస్‌ భారతి కాదా?

నారా లోకేశ్‌ తీరుపై మాజీ మంత్రి కొడాలి నాని మండిపడుతున్నారు. ఇటీవల నారా లోకేశ్ తన పాదయాత్రలో తన అమ్మను ఏదో అమ్మను అవమానించారని లోకేష్ అంటున్నారని.. చంద్రబాబే  ఆయన భార్యను  అల్లరి చేశారని.. కావాలంటే అసెంబ్లీ రికార్డును పరిశీలించేందుకు మేము సిద్దమని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. లోకేష్ వాళ్ల  అమ్మ మాత్రమే ఆడదా.. భారతి..కాదా.. అని మాజీ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు.

చంద్రబాబు, లోకేష్  ధైర్యం ఉంటే నా నియోజకవర్గానికి రావాలని మాజీ మంత్రి కొడాలి నాని సవాల్ విసిరారు. నా నియోజకవర్గానికి రా...నువ్వో నేనో తేల్చుకుందామని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. నన్ను లేదా వంశీనో టచ్ చేసి చూడాలని... మీ సంగతి తేల్చుదాం .. నేనూ దేనికైనా సిద్దం అంటూ మాజీ మంత్రి కొడాలి నాని సవాల్ విసిరారు. భారతమ్మ పేరు ఎత్తితే వారి సంగతి చెబుతానని.. వారిని జగన్ వదిలేసినా మేము వదలే ప్రసక్తి లేదని..  మేము కూడా సిద్దంగా ఉన్నాం రేపట్నుంచి చూద్దామని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు.

లోకేష్ మూడు వారాలుగా పాదయాత్ర చేస్తూ జగన్ పై వ్యక్తిగత విమర్శలు  చేస్తున్నారని..  చంద్రబాబు ఎర్రగడ్డ ఆస్పత్రినుంచి తూర్పుగోదావరి వచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. రాయల సీమలోనే పుట్టావా అని సీఎం జగన్ ను లోకేష్ అడుగుతున్నాడని.. లోకేష్ ఎక్కడ పుట్టాడని మేము అడిగితే సోషల్ మీడియాలో మాపై పిచ్చి పిచ్చిగా మాట్లాడిస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు.

సీఎం జగన్ రాయలసీమలోనే  పుట్టి పెరిగారని.. నారా లోకేష్ తెలంగాణలో పుట్టి  పెరిగారని.. లోకేష్ తెలంగాణ లో పుట్టి, పెరిగి ఏపీ లోకి ఎందుకు వచ్చారో చెప్పాలని మాజీ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. జగన్ డీఎన్ ఎ గురించి ప్రశ్నిస్తున్నారని.. ముందు లోకేష్ డీఎన్ ఎ గురించి చెప్పాలని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. చంద్రబాబు 13 ఏళ్లపాలనలో రాష్ట్రానికి దరిద్రం  పట్టించారని.. చంద్రబాబు ఒ అవినీతి చక్రవర్తి అని..  అవినీతి డబ్బును  హెరిటేజ్ లో పెట్టి చంద్రబాబు కోట్లకు పడగలెత్తాడని.. జగన్ ను సైకో అంటోన్న చంద్రబాబే  పెద్ద సైకో అని.. చంద్రబాబు అవినీతి చక్రవర్తి అని ఆయన మామ ఎన్టీఆర్ చెప్పారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: