ఏపీకి గుడ్‌న్యూస్‌ చెప్పిన కేంద్రం..?

ఏపీలో విజయవాడ , తిరుపతి,నెల్లూరు సహా పలు ప్రధాన రైల్వే స్టేషన్లను విమానాశ్రయాల తరహాలో అభివృద్ది చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందట. రాజమండ్రి ,గూడూరు సహా ముఖ్యమైన రైలు స్టేషన్లను ఆధునీకరిస్తారట. త్వరలో తెలుగు రాష్ట్రాల్లో నడిచే పలు ఎక్స్ ప్రెస్ రైళ్లను సమీపంలో ఉండే నగారానికి పొడిగిస్తారట. ధర్మవరం - విజయవాడ ఎక్స్ ప్రెస్ రైలును మచిలీపట్నం వరకు రైల్వే శాఖ పొడిగించారు.

ఈ వివరాలన్నీ  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రైల్వేలను మారుమూల ప్రాంతాలకూ తీసుకుపోవాలని కేంద్రం చర్యలు తీసుకుంటోందన్న  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి... ఆధునిక టెక్నాలజీ తో వేగవంతమైన రైళ్లు ప్రవేశపెట్టేలా కేంద్రం చర్యలు తీసుకుంటుందన్నారు. మోదీ ప్రభుత్వంలో కొత్త రైల్వే లైన్లు, ఎలక్ట్రిఫికేషన్ ,ట్రిప్లింగ్ పనులు ఉభయ రా ష్ట్రాల్లో వేగంగా జరుగుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

దేశవ్యాప్తంగా  అన్ని ప్రాంతాల్లో రైల్వే అభివృద్ది చేసేలా కేంద్రం పనిచేస్తుందని..  ఆంధ్ర రాష్ట్రంలో రైళ్ల అభివృద్దికి కేంద్ర బడ్జెట్ 8600వేల కోట్లు నిధులు కేటాయించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. యూపీఎ కంటే పదిశాతం అదనంగా నిధులను కేంద్రం కేటాయించిందని.. యూపీఎ  ప్రభుత్వ హయాంలో ఎపీలో  58కిమీ లైన్లు మాత్రమే వేయగా మోదీ ప్రభుత్వంలో  కొత్త గా 350కిమీ కొత్త లైన్లు వేశామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

మోదీ హయాంలో ఎపీలో 800కిలోమీటర్ల  డబ్లింగ్ ట్రిప్లింగ్ పనులు చేశారని.. పలు పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి కోసం కేంద్రం బడ్జెట్ లో నిధులు కేటాయించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఏపీ నుంచి కాచిగూడ, సికింద్రాబాద్ వచ్చే వారు నగరంలో దిగి పలు ప్రాంతాలకు వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారని..  హైదరాబాద్ కు  రైళ్లలో వచ్చే ఆంధ్రుల సౌకర్యం కోసం నగర శివారు  చర్లపల్లి వద్ద న్యూ  రైల్వే టర్మినల్ కడతామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: