భూకంప విలయం నుంచి టర్కీ కోలుకుంటుందా?

టర్నీ.. ఈ దేశానికి సిక్ మేన్ ఆఫ్‌ యూరప్‌ అని పేరు.. ఆ దేశం భూకంపంతో నిజంగానే ఇవాళ సిక్ మేన్ అయ్యింది. ఒకప్పటి ఖలీఫా సామ్రాజ్య పునాదుల్లోంచి రెక్కలు విచ్చుకొని, ఆధునికత వైపు స్వేచ్ఛగా ఎగిరి... ఇప్పుడు నిజంగానే ఒక సందిగ్దావస్థలో పడింది. ఆధునికతకి ఆయువుపట్టైన ఐరోపా, గొప్ప మానవ నాగరికత సంస్కృతులు విలసిల్లిన ఆసియా అనే రెండు ఖండాల్లోనూ భౌగోళికంగా విస్తరించి... విభిన్న మతాలు, జీవన విధానాల వల్ల ప్రభావితమై... క్రమంగా ఆధునికత వైపు శరవేగంగా అడుగులు వేసి, ఈయూలో కూడా సభ్యత్వం కోసం. పరితపించి... అంతలోనే పాలకుల ప్రాప్త కాలజ్ఞాత లోపించి క్రమంగా మత రాజకీయ దుష్ట వ్యూహ పాలకుల చేతిలో చిక్కింది.
 
తనకి సంబంధమే లేని కాశ్మీర్ అంశంలో తలదూర్చింది. పాకిస్తానీ దుందుడుకు టెంపరితనం విచ్చలవిడిగా ప్రదర్శించడానికి వేదికైంది. అటు మిశ్రమ, ఆర్తోడాక్స్ దేశమైనా ఆర్మీనియాలో అజర్ బైజాన్ కి వ్యతిరేకంగా వెలుపెట్టింది. ఇటు నిరంతర వేర్పాటువాద హింసాత్మక ఉద్యమాలకు నెలవైన కాశ్మీర్లో వదరుబోతునం ప్రదర్శించింది.  చివరికి తన కాళ్ళ ఏం జరుగుతుందో తెలియక చిగురుటాకులా వణికింది. ఏ మతం కేంద్రంగా అధినేతలు రాజకీయం చేయాలని, ప్రజలని తప్పుదోవ పట్టించాలని చూశారో... ఇవాళ అవే వైరి దేశాలు మానవత్వంతో తిరిగి అక్కడి ప్రజల రెస్క్యూ కోసం ఆపన్నహస్తం అందించాల్సిన పరిస్థితి.

ఎప్పటికైనా మానవత్వం గొప్పది. పాలకులకు కావాలసింది దార్శనికత, మానవాభివృద్ధి... మతం కాదు. మనం భూమిపై హద్దులు పెట్టుకొని, వేల కిలోమీటర్ల దూరంలోని దేశాలు, ప్రాంతాల మధ్య భూభాగాల్లో విద్వేష ఆజ్యం పోస్తున్నాం, తన్నుకు చేస్తున్నాం. కానీ అదే భూమి గర్భంలో ఉన్న అంతర్గత టెక్టానిక్ ప్లేట్స్ లోపల అంతర్గతంగా ఏళ్లతరబడి జరిగే 1-2 సెంటీమీటర్లు అత్యంత చిన్న కదలిక వల్ల వచ్చే ఉత్పాతం తాలూకు అంచనాలు కట్టలేం. చూడండి ఎక్కడో మధ్యధరా సముద్రంలో ద్వీపం ఆక్రమించింది. ఇవాళ అదే కాళ్ళ కింద నేల కంపిస్తే... 30 వేల మంది అదే సాంరాజ్య దూరహంకార పునాదుల్లో సజీవ సమాధి అయ్యారు. ఇవాళ ఆ దేశాధ్యక్షుడు రీసెప్ తయ్యబ్ ఎర్దగోన్ మళ్లీ ఎటువైపు అడుగులు వేస్తారో చూడాలి!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: