ఆ రంగంలోకి రిలయన్స్.. సంచలనాలు సృష్టిస్తుందా?

రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశ గతినే మార్చబోతుందా?  భారత ప్రభుత్వం ఎప్పుడో చెప్పింది పెట్రోల్, డిజీల్ వాడకానికి బదులు మిగతా సహజ వనురులపై ఆధారపడి స్వశక్తితో వేరే ఇంధనాన్ని తయారు చేసుకునేలా ప్రయత్నించాలని కోరింది. ఇందుకనుగుణంగా ఇప్పుడు ఒక చర్చ నడుస్తోంది. అదే జీవఇంధనం తయారు. అంటే హైడ్రోజన్ తో నడిచే వెహికల్స్ తయారీ.. దీన్ని రిలయన్స్ చేపడుతోంది.

పెట్రోల్, డిజీల్ వాడకాన్ని తగ్గించేందుకు సోలార్ వైండ్ ను ఇప్పటికే ఉపయోగిస్తున్నాం. కానీ అది అంతగా సక్సెస్ కాలేకపోతుంది. సోలార్ వైండ్ కు ఎక్కువగా డబ్బులు ఖర్చు అవుతున్నాయి. అయినా అనుకున్నంత ఎనర్జీ ని సంపాదించలేక పోతుంది. తక్కువగా ఉత్పత్తి కావడం వల్ల ఇబ్బంది కలుగుతోంది. దీన్ని ఆసరాగా చేసుకుని ఆయిల్ కంపెనీలు యథేచ్ఛగా ధరలు పెంచుతున్నాయి. అదేమిటంటే ఉత్పత్తి తగ్గిపోతుందని చెబుతుంటారు.

ఇలాంటి సమయంలో హైడ్రోజన్ తో నడిచే వాహనాలు తయారీ అయితే క్రమంగా పెట్రోల్, డిజీల్ వాడకం తగ్గిపోతుంది. దీంతో పర్యావరణానికి కూడా ఎక్కువగా ఇబ్బంది ఉండదు. దీని కోసం కార్పొరేట్ కంపెనీలు అయితేనే పోటీ ప్రపంచంలో ముందుకు సాగి ఒత్తిడిని తట్టుకుని నిలబడి పోరాడి విజయాన్ని సాధిస్తాయి. దీనికి కార్పొరేట్ కంపెనీలకు ప్రభుత్వం సాయం అందించాలి. రాయితీలు కల్పించాలి. ఇది గనక విజయం సాధిస్తే అన్ని వాహనాలను సైతం హైడ్రోజన్ తో నడిచే విధంగా తయారు చేయొచ్చు. పొల్యూషన్ ఉండదు. ఎక్కువ ఖర్చు కూడా కాదని తెలుస్తోంది.

మరి రిలయన్స్ చేస్తున్న ఈ పని విజయవంతమైతే ఎలాగైనా జీవ ఇంధనంతో నడిచే వాహనాలకు గిరాకీ వస్తుంది. భారత దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలవుతుంది. రిలయన్స్ సంస్థ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారు మోగిపోతుంది. ఇలాంటి సరికొత్త ప్రయోగాలతో ముందుకు దూసుకుపోతున్న కార్పొరేట్ కంపెనీలకు ప్రోత్సాహకాలను కేంద్రం ప్రకటించాలి. వారికి స్వేచ్చగా ప్రయోగాలు చేసుకునేందుకు తోడ్పాటు అందిస్తే అవి మరింత మెరుగ్గా పనిచేసి కచ్చితమైన విజయాన్ని సాధిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: