భారత అభివృద్ధి ఓర్వలేక.. కుట్ర జరుగుతోందా?

ప్రపంచమంతా జి.డి.పి. రేటు పడిపోతుంటే ఒక్క భారతదేశం మాత్రం వరుసగా 2 సంవత్సరాలు నెం.1గా ఉంది. వచ్చే సంవత్సరం కూడా అలానే ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. అదే సమయంలో చైనా విషయంలో  ప్రపంచ దేశాలన్నీ వెనుకడుగు వేస్తూ ఉంటే ఒక్క భారత్ మాత్రం ఒక ఢోక్లామ్ దగ్గర, ఒక తవాంగ్ దగ్గర నిలబెట్టేస్తుంది. ప్రపంచంలోని టాప్ 10 దేశాలలో అందరూ గుర్తించే విధంగా మన ప్రధాన మంత్రి మోడీ ఉన్నారు. ఈ గుర్తింపును దెబ్బ కొట్టడమంటే మన మూలాలను దెబ్బ కొట్టడమే.

ఈ దేశంలోని కార్పొరేట్ సంస్థల అవినీతి మూలంగా సుదీర్ఘ కాలం పాటు ఈ దేశ మూలాలు  ఎదగడానికి వీలు అవ్వలేదని బీజేపీ అంటోంది. ఇప్పుడు కార్పొరేట్ సంస్థలు డబ్బులివ్వమని అడిగే వాడు లేక అవినీతిని ప్రక్కన పెట్టి దర్జాగా, నిజాయితీగా వ్యాపారం చేస్తున్నాయని బీజేపీ అంటోంది. ఈ దేశ ఆర్థిక వ్యవస్థని ఉన్నత స్థితికి తీసుకు వెళ్తున్నాయి. లక్షలాది మంది జనానికి భారతీయ కంపెలు ఉద్యోగాలనిస్తున్నాయి. విదేశీ కంపెనీలు వచ్చి ఇక్కడ 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చి 1000 కోట్లు సంపాదిస్తే గొప్ప అనుకునే రోజుల్లో ఈ దేశంలోనే పుట్టిన వాళ్ళు, ఈ దేశానికే లబ్ధి చేకూరుస్తుంటే తట్టుకోలేక పోతున్నారు ప్రక్క వాళ్ళని బీజేపీ అంటోంది.  

వచ్చే ఏడాది కూడా మన జీ.డీ.పీ  6.8 శాతంగా ఆశాజనకంగా కనిపిస్తూ ఉంటే, అమెరికా, యూరప్ లాంటి దేశాల జీ.డీ.పీ 0.5 - 1.5శాతం మద్యలో ఉండడంతో భారత్ పై అక్కసుతో దెబ్బ తీయాలని చూస్తున్నాయట. హిండెన్ బర్గ్ నివేదిక బట్టి అదానీని దెబ్బ తీయడం కావచ్చు, లేక పోతే కళ్ళ డ్రాప్స్ అంటూ, దగ్గు మందులంటూ ఆపేయడం కావచ్చు, ఇలా ఇప్పటికే మన భారత్ ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న వ్యాపారాల మీద టార్గెట్స్ పెరుగుతూ ఉన్నాయని బీజేపీ అంటోంది. ఫార్మా రంగానికి సంబంధించి భారత్ బయోటెక్ లాంటి మరిన్ని సంస్థలపై దాడులు జరగొచ్చు. మనం కనుక అప్రమత్తం కాకపోతే మనల్ని దొంగలుగా చూపించే ప్రమాదం ఎక్కువ ఉందని బీజేపీ హెచ్చరిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: