తెలంగాణలో సీబీఐ వర్సెస్ కేసీఆర్‌?

సీబీఐ, తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ వర్సెస్ బీజపీ అంటే బాగుంటుందేమో. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కోర్టుకు వెళ్లిన బీఆర్ఎస్ నాయకులు. అది ఆర్టీపిషీయల్ గా బీఆర్ఎస్ ఆడించిన నాటకం.. అంటూ బీజేపీ విమర్శలు. మొత్తం మీద కోర్టు లో ఉన్న కేసు కాస్త సీబీఐ వద్దకు చేరింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు కొట్టేయమని కోరడం దాన్ని కోర్టు తోసిపుచ్చడం జరిగింది. ఈ విషయంపై బీఆర్ఎస్ పార్టీ సుప్రీం కోర్టుకు వెళ్లింది. దీంతో సుప్రీం కోర్టులో కేసు ఈ నెల 17 న విచారణకు రానుంది. అయితే అప్పటి వరకు రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సీబీఐ తన విచారణను కొనసాగించవచ్చు.

దీనిపై సీబీఐ, ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి చీప్ సెక్రటరీకి అయిదు సార్లు లేఖలు రాసింది. మీ వద్ద ఉన్నా ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలు సమర్పించాలని కోరింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన కరవైంది. అయితే 17 న సుప్రీం లో విచారణ ఉంది. కాబట్టి అప్పటి వరకు కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు సమర్పించేందుకు తెలంగాణ సర్కారు మౌనాన్ని ప్రదర్శిస్తోంది.

మొత్తం మీద ఎమ్మెల్యేల కొనుగోలు రాష్ట్ర పరిధి దాటి సుప్రీం కోర్టు, సీబీఐ వరకు వెళ్లింది. తెలంగాణ సర్కారు, బీజేపీ పార్టీల మధ్య ఈ విషయమై పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తయారైంది. రాష్ట్రంలో ఓ పక్క ఢిల్లీ లిక్కర్ స్కాం, మరో పక్క ఎమ్మెల్యేల కొనుగోలు అంశంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సై అంటే సై అంటూ దూకుడుగా ముందుకెళుతున్నాయి. మరి ఈ స్కాంల గొడవ ఎంత దూరం వెళుతుందో ఏ పార్టీకి అనుకూలంగా మారుతుందో ఏ పార్టీకి ఓట్లను తెచ్చిపెట్టి అధికారంలోకి తీసుకొచ్చే వరంలా తయారవుతుందో వచ్చే ఎన్నికల నాటికి తేలనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

KCR

సంబంధిత వార్తలు: