దివాలా దిశగా ప్రపంచం.. భారత్‌ మాత్రం సూపర్‌?

వచ్చే 20 సంవత్సరాల్లో భారత్ ప్రపంచంలోనే గర్వించదగిన దేశంగా తయారవబోతోంది. దీనికి సంకేతమే ప్రస్తుతం మనం ఆర్థికంగా బలపడటం. ముఖ్యంగా రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల యూరప్ దేశాలు ఆర్థికంగా కుదేలవుతున్నాయి. అమెరికా లో ఉద్యోగాలు పోయి నిరుద్యోగులుగా మారుతున్నారు. అదానీ, అంబానీ, టాటాలను దెబ్బతీయాలని అమెరికా, యూరప్ దేశాలు ప్రయత్నిస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి.

దానికి ఇండియాలో చాలామంది వత్తాసు పలుకుతున్నారు. వీరు దెబ్బతింటే ఒక్కరు నష్టపోయినట్లు కాదు. దేశంలోని ఎంతోమందికి వీరి కంపెనీల్లో ఉపాధి లభిస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థలో వీరిది కూడా ఒక పాత్ర. అలాంటి వారిని నష్టపరచాలని అమెరికా, యూరప్ దేశాలు కంకణం కట్టుకుని మరి ప్లాన్ లు వేస్తున్నాయి.  దీన్ని ఆసరాగా తీసుకుని కొంతమంది అవివేకులు అదానీ కి ప్రభుత్వం అండగా ఉంటోందని చౌకబారు విమర్శలు చేస్తున్నారు.

భారతదేశాన్ని నాశనం చేయాలని కొందరు వ్యక్తులు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి. దీనిపై ఒక వ్యక్తి చేసిన విశ్లేషణ ఆలోచింప జేసేలా ఉంది. కన్నీళ్లతో న్యూజిలాండ్ ప్రధాని పదవికీ రాజీనామా చేశారు. దిక్కు లేని పడవగా మారిపోయింది. కారణం డబ్బు లేదు. పదవి లేదు. ఆస్ట్రేలియాలో కూడా రిజర్వ్ లేదు. బ్రిటన్ ప్రస్తుతం ఆర్థికంగా చితికిపోయింది. అమెరికా లో ఉద్యోగాలు పోతున్నాయి. కరోనా కారణంగా చైనా కొట్టుమిట్టాడుతోంది. రష్యా, ఉక్రెయిన్ కారణంగా మొత్తం యూరోపియన్ యూనియన్ దేశాలు చెల్లా చెదురయ్యాయి.

సంక్షోభంలో భారత్ పక్కనున్న పొరుగు దేశాలు పాకిస్థాన్, ఆఫ్గానిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ లు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి దివాలా తీశాయి. తమ ఉద్యోగులకు డబ్బులివ్వాలేని పరిస్థితిలో ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇన్ని జరుగుతున్నాభారత్ ను మాత్రం ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారు. భారత్ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు మరింత మెరుగుపడుతోంది. సైన్యం ఆధునీకరణ, ఎక్స్ ప్రెస్ వేలు, వందల ప్రాజెక్టులు, రైల్వే లైనులు, ఇలా ఒక్కటేమిటి భారత్ వచ్చే 20 ఏళ్లలో తిరుగులేని శక్తిగా ఎదుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: