పాక్‌.. ఓవైపు మతపిచ్చి.. మరోవైపు దరిద్రం?

పాకిస్తాన్‌ రూపాయి విలువ డాలర్ తో పోలిస్తే 270 రూపాయలకి పడిపోయింది. పాకిస్తాన్ ని దరిద్రం వదిలిపెట్టడం లేదు. గోధుమపిండి కూడా దొరక్క ఇతర దేశాల నుంచి అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అక్కడ. ఇతర దేశాలు ఇచ్చేటువంటి ఆహార సదుపాయాలను కూడా దోచుకుపోయే పరిస్థితి నెలకొంది అక్కడ. ప్రజలు ప్రభుత్వంపై తిరగబడుతున్నారు. అయితే దీనిని కవర్ చేయడానికి అక్కడ మత పిచ్చిని రేకెత్తించే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ మధ్యన ఒక కాలేజీ ని ధ్వంసం చేసారు అక్కడ. కారణమేమిటంటే అక్కడ జరిగిన ఒక పరీక్ష లోని ప్రశ్నలో అల్లాను దూషించారు అని మొదలుపెట్టి. అల్లా గురించి ఆ ప్రశ్నపత్రంలో ఉన్న ప్రశ్న ఆ విధ్వంసానికి కారణం అయ్యింది.  అల్లా గురించి ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదంటూ వారు ఇలా చేశారు. ఆ కాలేజీని ధ్వంసం చేయడమే కాకుండా ఒక ముస్లిం లెక్చరర్ ని కూడా అరెస్టు చేయించారు. అలా అక్కడ మతపరమైన చిచ్చును రేపుతున్నారు. మరొకవైపు కరాచీలో ఉన్నటువంటి అహమదీయుల మసీదుగా గుర్తించని ఒక కట్టడాన్ని కూడా వారు ధ్వంసం చేశారు.

ఇవి రెండూ ఒక ఎత్తు అయితే, వికీపీడియా దైవ దూషణ చేస్తున్నట్టు దానిపై కూడా కత్తి కట్టారు. భగవంతుని పట్ల గౌరవం లేకపోవడం లేదా అవమానపరిచే చర్య అంటూ వారు దాని గురించి వికీపీడియా పై ధ్వజమెత్తి, దానికి 48 గంటల పాటు డెడ్ లైన్ ని ఇచ్చింది పాకిస్తాన్ టెలి కమ్యూనికేషన్ శాఖ. వికీపీడియాలో దైవ దూషణని తొలగించండి అంటూ వారు చెప్పుకొస్తున్నారు. దాదాపుగా వారు వికీపీడియాని బ్యాన్ చేస్తామని ప్రకటిస్తున్నారు.

2021 లో పాకిస్తాన్ లో ఇదే దైవ దూషణ పేరుతో 89 మందిని ఉరివేశారు, 1500 మందిని జైల్లో పెట్టారు. ఈ విషయాన్ని సెంటర్ ఫర్ రీసెర్చ్ తేల్చి చెప్పింది. 2011లో ఒక పాక్ మహిళను ముక్కలు ముక్కలుగా నరికినప్పుడు నుంచి పెరుగుతున్న ఈ ఉన్మాదం ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: