అదానీ దెబ్బ.. ఆ దేశంపై ఎక్కువగా ఉందా?


ప్రస్తుతం అదానీ పై పడిన దెబ్బ తన సంస్థలకు మాత్రమే పడుతుంది. ఇప్పటికే ఎస్బీఐ ఎంత అప్పులు ఇచ్చాయని చెప్పేసింది. ప్రపంచ దేశాలు మాత్రం భారత్ ఆర్థిక పరంగా కుప్పకూలితే చూడాలని ఎదురుచూస్తున్నాయి. కానీ ఒక వ్యక్తి నష్టపోయినంతా మాత్రాన మన ఆర్థిక వ్యవస్థకు ముప్పు వచ్చినట్లు కాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఇప్పటికే ప్రకటించారు.

ఇండియా ఆయుధాలను తయారు చేయాలని సంకల్పించింది. ఈ తయారీలో చేరాలనుకుంటున్నాయి కార్పొరేట్ సంస్థలు. అమెరికా ఆయుధ కంపెనీలు, బ్రిటన్ ఆయుధ కంపెనీలు, ఇతర దేశాలతో పోటీ కొనసాగుతూనే ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచ బిలియనీర్ల ర్యాంకుల్లో అదానీ 26 వ స్థానానికి పడిపోయారు. బ్రిటన్ లో బొరిస్ జాన్సన్  అదానీ పతనం వల్ల దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.

బ్రిటన్ లో మాజీ ప్రధాని బొరిస్ జాన్సన్, బ్రదర్ జో జాన్సన్ అదానీ ఎంటర్ ప్రైజేస్ తో అనుబంధం ఉన్న ఎలారా క్యాపిటల్ అనే సంస్థకు డైరెక్టర్ గా ఉన్నారు. ప్రస్తుతం ఆయన తన పదవికీ రాజీనామా చేశారు. అదానీ కంపెనీల్లో పెట్టిన పెట్టుబడులను ఉపసంహరించు కుంటున్నారు. అదానీ కంపెనీలతో ఆర్థికంగా ఉన్నటువంటి అన్నింటిని వీరు విడిచిపెడుతున్నారు.

అంటే ఇప్పటివరకు హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత కేవలం ఇండియాలోనే అదానీ కంపెనీల షేర్లు, ఇతర కంపెనీలు నష్టాల్లో కూరుకుపోయాయని అందరికీ తెలుసు. ఈ పతనం కేవలం ఇండియాతో ఆగడం లేదు. మిగతా దేశాల్లో ఉన్న అదానీ వ్యాపారాలను సైతం కుదేలు చేస్తూనే ఉంది. రోజురోజుకు ఆయన కిందస్థాయికి దిగజారి పోతున్నారు. అదానీ మరి ఇలాంటి పరిస్థితులను ఏ విధంగా ఫేస్ చేస్తాడు. నష్టాల బాటను తప్పించి లాభాల బాటలో పయనించాలంటే ఆయన ఎలాంటి నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వం ఆయనకు అండగా ఉండే అవకాశం ఉందా? మళ్లీ ఆయన వ్యాపార దిగ్గజంగా నిలదొక్కుకుంటారా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: