ఏపీలో సీన్ మారుతోందా.. జగన్‌కు కష్టకాలమేనా?

ఆంధ్రప్రదేశ్ లో 90 శాతం మీడియా తెలుగుదేశం అనుకూల మీడియానే ఉంది. సాక్షి మాత్రం వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా ఉంటుంది. టీడీపీ మీడియా జగన్ ను తిడుతుంది. సాక్షి టీడీపీని విమర్శలు చేస్తూ వస్తుంది. మంచి చేస్తున్నప్పుడు మంచిగా చెడు చేస్తున్నప్పుడు చెడును చెప్పే మీడియా అరుదుగా ఉన్నాయని చెప్పొచ్చు.

ప్రస్తుతం 24 మంది వైసీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబుతో టచ్ లో ఉన్నట్లు జగన్ కు అందిన సమాచారం. కానీ టీడీపీ వాళ్లు చెబుతున్న సంఖ్యం 30 నుంచి 35 అని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్లకు ప్రస్తుతం పెద్ద షాక్ ఏమిటంటే జనసేనతో పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్నారు. పొత్తు పెట్టుకుంటే మినిమం వారికి 30 సీట్లు అయితే ఇవ్వాలి. జనసేన వాళ్లు 57 సీట్లను అడుగుతున్నారు. 57 కి బదులు 30 ఇచ్చినా వైసీపీ నుంచి టీడీపీకి వచ్చే దాదాపు 30 మందికి ఎలాగైనా ఇవ్వాల్సిందే.

అంటే ప్రస్తుతం టీడీపీ నుంచి పోటీ చేయాలని భావిస్తున్న 60 మందికి పైగా ఆశలు వదులుకోవాల్సిందే. ఇందులో ఎమ్మెల్యేలు అయి ఉండొచ్చు. ఎమ్మెల్యే అభ్యర్థిగా గతంలో పోటీ చేసి ఓడిపోయి ఉండొచ్చు మరి వీరందరి పరిస్థితి ఏమిటి? వీరంతా జగన్ చెంత చేరతారా? లేక స్వతంత్రంగా పోటీ చేస్తారా.. టీడీపీకి వ్యతిరేకంగా నిలబడతారా అన్నది సాధారణ ఎన్నికల నాటికి తేలనుంది. ముఖ్యంగా టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య పోటీ రసవత్తరంగా ఉండటం మాత్రం పక్కా.. కానీ ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపిక చేయడం టీడీపీ, వైసీపీ పార్టీలకు ముందున్న పెద్ద సవాల్ అని చెప్పొచ్చు.

అదే సమయంలో ఇలా టీడీపీ వైపు నేతలు మొగ్గుచూపుతున్నారన్న ప్రచారం.. వైసీపీకి ఏ మాత్రం మంచిది కాదు. అధికారం ఉన్నవైపు నేతలు పరుగులు తీయడం మామూలే కానీ.. ఇలా  ప్రతిపక్షం వైపు నేతలు మొగ్గుచూపుతున్నారంటే.. ఏపీలో సీన్ క్రమంగా మారుతుందన్న అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంది. మరి ఈ మార్పులు ఎటు దారి తీస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: