విద్యార్థులను టీచర్ కొట్టడం తప్పా.. కాదా?

విద్యా వ్యవస్థ లో క్రమశిక్షణను విద్యార్థులు సరిగా తీసుకోలేకపోవడం వల్ల దాని పర్యావసనం ఇప్పుడు చాలామంది వ్యక్తులు ఫేస్ చేస్తున్నారు. తాజాగా సమాజంలో జరుగుతున్న పరిణామాలే దానికి పెద్ద ఉదాహరణ. విద్యా వ్యవస్థలో ఒక టైం లో బెదిరింపు అనేది ఉండేది. దాన్ని బెదిరింపు అనడం కన్నా మందలింపు అనాలేమో. మన మంచి కోసం మన మాస్టర్లు చేసినటువంటిది ఆ మందలింపనేది. దానికోసం వారు సామ, దాన, భేద, దండోపాయాల ద్వారా మనకు పాఠాలు చెప్పేవారు.

మొదట మామూలుగా అయితే సౌమ్యంగా చెప్పేవారు, లేదా ఏదైనా గిఫ్ట్ ఇస్తానని ఎరగా చూపించి చదివించేవారు. అలా కూడా వాళ్ళు మాట వినకపోతే తాటతీస్తాను అని బెదిరించి చదివించే వాళ్ళు. చివరకు బెదిరించినా వినకపోతే దండించి మరీ చదివించే వాళ్ళు అప్పటి మాస్టర్లు. అలా చదువుకున్న పిల్లలు తర్వాత ఐ.ఏ.ఎస్ లు ఇంకా ఐ.పీ.ఎస్ లుగా జీవితంలో మంచి ఉన్నత స్థానంలో నిలబడ్డారు.

కానీ ఈ రోజుల్లో చదువు నేర్పించే విషయంలో దండించిన పాపానికి టీచర్ల పైనే కేసులు పెడుతున్నారు కొంతమంది పిల్లలు. అసలు ఈ విద్యా వ్యవస్థలో మార్పులకు కారణం ఏంటంటే, ప్రపంచ దేశాల్లో ఉన్న చట్టాలన్నీ తీసుకొచ్చి ఈ దేశంలో పెట్టడమే. కొన్ని దేశాల్లో 16 ఏళ్లు నిండగానే పిల్లల పెంపకం అనేది వదిలేయాలి. కానీ భారతదేశంలో చాలావరకు జీవితాంతం తల్లిదండ్రులే పిల్లల్ని చూసుకునే సంస్కృతి ఉంది. ఆ సంస్కృతిని విదేశీ సంస్కృతి ద్వారా నాశనం చేసేస్తున్నారు.

ఇప్పుడు తాజాగా ఒక టీచర్ గారికి విధించిన శిక్షను  హైకోర్టు రద్దు చేసింది. క్రమశిక్షణ కోసం ఉపాధ్యాయులు విద్యార్థిని శిక్షించడం నేరం కాదు అని బాంబే హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇద్దరు పిల్లల్ని కొట్టినందుకు గాని పాఠశాల ఉపాధ్యాయులకు ఒక రోజు జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించినటువంటి నేరాన్ని కోర్టు రద్దు చేసింది బాంబే కోర్టు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: