కుప్పకూలిన అదానీ.. మళ్లీ కోలుకోగలడా?

హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత అదానీ కంపెనీకి సంబంధించిన షేర్లు కుప్పకూలిపోతున్న విషయం అందరికీ తెలిసిందే. దీంతో సంపన్నుల జాబితాలో  1 వ స్థానం నుంచి 17వ స్థానానికి అదానీ పడిపోయారు. తన కంపెనీల్లో షేర్లు కొన్న వారికి పెట్టుబడులు పెట్టిన వారికి తిరిగి డబ్బులు ఇచ్చేస్తామని అదానీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. జనాల దగ్గర డబ్బులు తీసుకుని వాటిని ఎగ్గొడతారని ప్రచారం చేస్తున్న తరుణంలో అలాంటిదేమీ లేదని పెట్టుబడి దారులకు భరోసా కల్పించేందుకు వారు పెట్టిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేందుకు ఆయన సిద్ధమయ్యారు.

ఈ ఆకస్మిక నిర్ణయం వెనక అదానీ ఎంటర్ ప్రైజేస్ ఒక ప్రెస్ నోట్ రీలీజ్ చేసింది. ప్రస్తుతం 17 వ స్థానానికి పడిపోయిన నేపథ్యంలో అప్పులతో వ్యాపారం చేస్తున్నారనే ఆరోపణలను పటా పంచలు చేయాలి. అందుకు ప్రజల్లో ఒక విశ్వాసం కలిగించాలని నిర్ణయం తీసుకున్నారు.  ఇప్పటి వరకు ఎవరైతే అదానీ ఎంటర్ ప్రైజేస్ లో పెట్టుబడి పెట్టారో వారికి డబ్బులు వాపస్ ఇచ్చేయనున్నామని ప్రకటించారు.

ఈ సంచలన నిర్ణయం వల్ల అప్పులు కాకుండా తమకంటూ ఆస్తులు ఉన్నాయి. తమవి అప్పులతో నడిచే కంపెనీలు కాదని ప్రజల్లో నిరూపించుకోవాలని అదానీ ఎంటర్ ప్రైజేస్ భావిస్తోంది. మొత్తంమీద అదానీ గ్రూపుల్లో ఎక్కువగా పెట్టుబడి పెట్టి తొందరగా కోటీశ్వరులం అయిపోదామని భావించిన వారికి నిజంగా తీవ్రమైన ఎదురుదెబ్బ లాంటిదే. ఇప్పటికే షేర్ మార్కెట్ రంగంలో చాలా వరకు ఇలాంటి కంపెనీలు మోసం చేసి ప్రజల డబ్బులను పోగొట్టిన విషయం తెలిసిందే.

అదానీ ఎంటర్ ప్రైజేస్ లో తప్పిదాలు ఏమీ జరగడం లేదని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. తమ కంపెనీలు నమ్మదగినవి అని నిరూపించడానికి చేస్తున్న పనే ఇది.. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయన్న సామెత వీరి పతనాన్ని చూస్తే తెలుస్తోంది. ఎంత వేగంగా మొదటి స్థానానికి అదానీ చేరుకున్నారో అదే వేగంతో కింద స్థాయికి పడిపోయారన్నది మాత్రం సత్యం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: