ఆ స్కామ్‌ ఇప్పుడు కేజ్రీవాల్ మెడకు చుట్టుకుందా?

ఢిల్లీ లిక్కర్ స్కాం సంచలన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మనీష్ సిసోడియా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ఏమిటంటే మద్యం దుకాణాలు, బార్లు, వాటి లైసెన్సులు గురించి గవర్నర్ కు ఒక నివేదిక ఇచ్చారు. మద్యం దుకాణాలను ఇప్పటి వరకు ప్రభుత్వ అనుమతితో నడిపే వారు. దీన్ని ప్రైవేటు పరం చేయాలని గవర్నర్ కు వినతి ఇచ్చారు. దీనికి గవర్నర్ అనుమతిస్తూ ఒక షరతు పెట్టారు. కొత్తగా ఏ విధానం ప్రవేశపెట్టాలంటే దానికి ఒక చట్టం తీసుకురండని గవర్నర్ అన్నారు. దీన్ని పెడ చెవిన పెట్టిన మనీష్ సిసోడియా గవర్నర్ కు తెలియకుండానే ఏ విధానాన్ని తయారు చేయకుండానే హవాలా మార్గంలో అక్రమ మార్గంలో లిక్కర్ అమ్మకాలు చేపట్టారు.

దీనికి సంబంధించి ఢిల్లీలో మీటింగ్ పెట్టుకుంటే తెలిసిపోతుందని హైదరాబాద్ కు మకాం మార్చారు. హైదరాబాద్ లో వ్యాపారా లావాదేవీలు నడుపుకున్నారు. దీనికి మనీష్ సిసోడియా నాయకత్వం వహించారు. ఈ లిక్కర్ స్కాంలో ఉన్నటువంటి నాయకులు ఏ హోటళ్లో సమావేశ మయ్యారు. ఎక్కడ కూర్చున్నారు. ఏ హవాలా మార్గంలో వీరికి డబ్బులు అందాయి అనే అన్ని లెక్కలు ఈడీ దగ్గర ఉన్నాయి. దీనికి సంబంధించి మొదటి ఛార్జీషీట్ లో మనీష్ సిసోడియా పేరు లేదు, రెండో ఛార్జీషీట్ లో కూడా ఆయన పేరు లేదని సంతోషించే లోపు ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బె తగిలింది.

ఏకంగా అరవింద్ కేజ్రీవాల్ పేరును రెండో ఛార్జీషీట్ లో ఈడీ నమోదు చేయడం సంచలనంగా మారింది.  సిసోడియాకు కేజ్రీవాల్ చెబితేనే చేస్తాడు కదా కేజ్రీవాల్ అనుమతి లేనిది చేయడనేది ఇప్పుడు తెలుస్తున్న విషయం. ఇదే లిక్కర్ స్కాం కేసులో ఛార్జీ షీట్ లో ఏపీ నుంచి వైసీపీ ఎంపీ మాగుంట, తెలంగాణ నుంచి ఎమ్మెల్సీ కవిత పేరు ఉండటంతో ఈ కేసుకు ఎక్కువ ప్రాధాన్యత ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: