మాజీ సీఎం ఓకే.. ఆ రాష్ట్రంలో కేసీఆర్ ఎఫెక్ట్‌ ఎంత?

సీఎం కేసీఆర్ అనుకునేది ఏమిటంటే తను ఏదైతే విషయాన్ని అనుకుంటున్నాడో అది కచ్చితంగా ఒప్పు అని భావిస్తారు. ఇతరుల మాటలను అస్సలు వినడు. సీఎం కేసీఆర్ కు ఉన్న నెగటివిటీ పాయింట్ కుటుంబ పాలన, కొడుకు మంత్రి, కూతురు ఎమ్మెల్సీ, మేనల్లుడు మంత్రి ఇలా పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఇలా కుటుంబ పాలన కొనసాగడం నెగిటివిని తెచ్చి పెట్టింది.

ఇదే  సమయంలో రాష్ట్రంలో త్రిముఖ పోటీ నెలకొంది. దీంతో కేసీఆర్ కు గెలుపుపై ధీమా నెలకొంది. కానీ ఇదే ద్విముఖ పోరు అయి ఉంటే కేసీఆర్ పరిస్థితి వేరేలా ఉండేది. తెలంగాణ వాదాన్ని పైకి తీసుకొచ్చి సాధించిన నేత అని అనుకుంటే అది ఒకప్పుడు ఉండేది. ప్రస్తుతం పూర్తిగా పరిస్థితులు మారిపోయాయి. ప్రజల్లో చైతన్యం వచ్చింది. మార్పు కూడా కనిపిస్తోంది.

సామాన్య కుటుంబం నుంచి వచ్చి ముఖ్యమంత్రిగా ఎదిగిన గిరిధర్ గోమంగ్ ను కాంగ్రెస్ పక్కన బెట్టింది. ఒకప్పుడు ఇండియా టుడే లో ప్రధాన కవరేజీగా ఈయన కథనాన్ని ప్రచురించారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు.. పార్టీని ముంచేశాడు అనే కోణంలో కాంగ్రెస్ పార్టీ ఆయన్ని పక్కన పెట్టింది. భార్య హేమ గోమంగ్, కుమారుడు శశి గోమంగ్ కూడా కాంగ్రెస్ లో చేరారు. వీరందరూ పార్టీలో చేరడంతో కాంగ్రెస్ లో కుటుంబ పాలన అనే నినాదం వచ్చింది.

ఒకవేళ కేసీఆర్ జాతీయ స్థాయిలో అధికారం చేపడితే రాష్ట్రంలో కుటుంబానికి పాలన అప్పజెబుతారా?.. గిరిధర్ గోమగ్, ఆయన కుమారుడు కూడా బీఆర్ఎస్ లో చేరడం, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి బీఆర్ఎస్లో చేరడం, ఒరిస్సాలో ఎంతమేరకు బీఆర్ఎస్ బలపడుతుందో చూడాలి. తెలంగాణ నుంచి ఇటు కుటుంబం, అటు ఒరిస్సా నుంచి గోమగ్ కుటుంబం బీఆర్ఎస్ ను ప్రజల్లోకి ఎలా తీసుకెళతాయనేది వచ్చే సాధారణ ఎన్నికల నాటికి తెలుస్తుంది. గోమగ్, కేసీఆర్ రాజకీయ కలయిక హిట్టా, పట్టా అనేది ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

BRS

సంబంధిత వార్తలు: