కాశ్మీర్‌లో రాహుల్ గాంధీ మళ్లీ మంటలు రేపుతారా?

భారత్ జోడో యాత్ర దేశ వ్యాప్తంగా ముగిసింది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ  చివరగా కశ్మీర్ లో ముగింపు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జమ్మూ కశ్మీర్ లో 370 ఆర్టికల్ ను బీజేపీ ప్రభుత్వం రద్దు చేసింది. దాన్ని మేము  అంటే కాంగ్రెస్ నేతలు  పునరుద్ధరిస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. అలాగే దీంతో పాటు ఉన్న 35 ఆర్టికల్ ను కూడా పునరుద్ధరిస్తామని ఆయన అన్నారు.

అసలు విషయంలోకి వస్తే బీజేపీ ప్రభుత్వం ఈ రెండు ఆర్టికల్స్ ను తొలగించడానికి నానా అవస్థలు పడ్డారు. జమ్మూ కశ్మీర్ లోకి ప్రస్తుతం భారత్ లోని ఏ రాష్ట్రానికి చెందిన వారైనా అక్కడ ఉద్యోగం చేయడానికి వెళ్ల వచ్చు. గతంలో ఉన్న 370, 35 ఆర్టికల్స్ వల్ల జమ్మూ కశ్మీర్ యువత ఇండియాలో ఎక్కడైనా చదువుకోవచ్చు. ఇక్కడి వారిని ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు. ఈ ప్రాంతంలో వ్యాపారం చేయొచ్చు. మొత్తంగా ఏదైనా చేయవచ్చు.

కానీ  గతంలో అక్కడికి వెళ్లి భారత్ లో ఉన్న యువత కానీ, మరే ఇతరులు కూడా ఏమీ చేయరాదు. ఉద్యోగం, వ్యాపారం, చివరికి చదువుకోవడానికి వీలు లేదు. అక్కడి అమ్మాయిలని పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు. ఇలాంటి ఆర్టికల్ ను బీజేపీ ప్రభుత్వం కూకటి వేళ్లతో సహా పెకిలించేసింది. కానీ కాంగ్రెస్ నుంచి ప్రధాని అభ్యర్థిగా ఉన్న రాహుల్ గాంధీ దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మేం మళ్లీ ఆ రెండు ఆర్టికల్స్ ను పునరుద్ధరిస్తామని బహిరంగంగానే అన్నారు. అంటే కేవలం ఒక మతానికి, ప్రాంతానికి మైనార్టీ ఓట్ల గురించే కదా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు.


ఇలా చేయడం వల్ల ఏమైనా లాభం ఉందా? ఈయన దేశానికి ప్రధాని అయి ఏం కార్యక్రమాలు చేస్తారు.. ఇప్పుడిప్పుడే దేశ యువత కానీ ఇతరులు కానీ కశ్మీర్ కు స్వేచ్చగా వెళ్లగలుగుతున్నారన్న వాదన ఉంది. అది కూడా లేకుండా రాహుల్ గాంధీ చేయాలనుకుంటున్నారా అన్న విమర్శలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: