ఆ విషయంలో హరీశ్‌రావు.. వెరీ గ్రేట్‌?

రాజకీయాల్లో కొంతమంది నాయకులు ఎప్పటికీ గుర్తుండిపోతారు. వారు చేసే సేవ వారు చూపించే మార్గం, ప్రజల పట్ల ఉండే నిబద్ధత లాంటివి ఎప్పటికీ మర్చిపోరు. ఒకప్పుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బంజారాహిల్స్ లోనే తన క్యాంపు కార్యాలయంలో తనను కలవడానికి వచ్చే ప్రజల కోసం ప్రత్యేకంగా భోజనాలు ఏర్పాటు చేసేవారు. ఆ క్యాంపు కార్యాలయం చుట్టూ ఎంతో మంది వేచి ఉండేవారు. వారికి సరైన భోజనం అందించేవారు.

అచ్చం ఇలానే కుప్పం నుంచి చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి వ్యక్తులు గాని ఆ నియోజకవర్గ ప్రజలు గాని చంద్రబాబుని కలవడానికి వస్తే వారికి ప్రత్యేకంగా భోజనాలు ఏర్పాటు చేసే అలవాటు చంద్రబాబుకు ఉంది. గతంలో టిడిపి కూడా ఎన్టీఆర్ భవన్లో ప్రెస్ వారికి గాని కార్యకర్తలకు గానీ మీటింగ్ హాజరయ్యే వారికి భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేసేది. ముఖ్యంగా విలేకరులకు కూపన్స్ ఇచ్చి ఆ మీటింగ్ కు వచ్చిన వారి కడుపు నింపేది. అంటే రాజకీయాల్లో వారు చెప్పింది విని రాసుకోవడం కాదు. వారి కడుపు నింపడం కూడా తెదేపాకు అలవాటు.

అలానే కొంతమంది కొన్ని పార్టీలు కొంతమంది రాజకీయ నాయకులు తమని కలవడానికి వచ్చే వ్యక్తులను ఆకలి తీర్చడానికి చాలా విధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు.ఎంతో దూరం నుంచి తమ నేతలను కలిసేందుకు కొంత మంది వస్తే చూసి చూడనట్టు వ్యవహరిస్తారు. కానీ కొంతమంది ప్రత్యేకంగా వారికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తారు.

ప్రస్తుతం  బిఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు హైదరాబాద్ లో తనను కలవడానికి వస్తున్నటువంటి కార్యకర్తలకు, ప్రజలకు మంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక భోజనాలను ఏర్పాటు చేస్తున్నారు.  పప్పు, చారు, మంచి భోజనం, ఇలా ఎవరు బయట తినకుండా ఇక్కడ ప్రత్యేకంగా ఒక షెడ్డు ఏర్పాటు చేసి వారికి భోజనాలను ఏర్పాటు చేస్తున్నారు. దీనితో హరీష్ రావుని అందరూ మెచ్చుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: