బీఆర్‌ఎస్‌ సభలో కేసీఆర్‌.. ఆంధ్రా నేతలను అవమానించారా?

కేసీఆర్ బీఆర్ఎస్ జాతీయ పార్టీ పెట్టారు. కానీ అది జాతీయ పార్టీగా మారాలంటే నాలుగు రాష్ట్రాల్లో ఆరు శాతం ఓట్లు రావాలి. ఇది రాజ్యాంగంలో ఉన్న అసలైన రూల్. తెలంగాణ సీఎం భారీ సభ పెట్టారు. పాత ఉపన్యాసాన్నే మళ్లీ మళ్లీ చెప్పారు. ఒరిస్సా బీఆర్ఎస్ అధ్యక్షుడిని నియమించారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ను నియమించారు.

అసలు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కె. కేశవరావు సీనియర్ నాయకుడు సభలో దూరంగా కనిపించారు. డిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ వీళ్లే సభా స్థానంలో కనిపించారు. వాళ్లకు తెలంగాణకు ఏం సంబంధం. అసలు బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడికి స్టేజిపైన స్థానమే కనిపించలేదు.

దీంతో తోట కిందకెళ్లి ప్రెస్ గ్యాలరీలో కూర్చున్నారు. దీంతో అక్కడెవరో చూసి స్టేజిపైకి పిలవాల్సి వచ్చింది. జాతీయ నాయకుడిగా రావెల కిషోర్ బాబును ఎదగాలని చెప్పిన సీఎం కేసీఆర్ ఆంధ్ర బీఆర్ఎస్ నాయకులను ఎందుకు పట్టించుకోలేదు. మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ సీఎంలకు ఇచ్చిన గౌరవం వీరికి ఎందుకు ఇవ్వడం లేదు. అసలు పట్టించుకున్న పాపన పోయారా? వీరిని సీఎం కేసీఆర్ పావులుగా వాడుకుంటున్నారన్నది సభకు వచ్చిన వారికి స్పష్టంగా అర్థమయింది. కానీ తోట, రావెల, ఒరిస్సా బీఆర్ఎస్ అధ్యక్షుడికి అర్థం అయిందో లేదో చూడాలి.

ఒక జాతీయ పార్టీగా అవతరించాలనుకుంటున్న బీఆర్ఎస్ సభలో అన్ని రాష్ట్రాల వారిని సమానంగా చూడాల్సింది పోయి. ఆంధ్రప్రదేశ్ నాయకులను దిక్కు మొక్కు లేని నాయకుల్లాగా చూడటం ఎంతవరకు సబబు. ఇలాగైతే భారాస ఆంధ్రలో కనీస ఓట్లు దక్కించుకుంటుందా. తెరాస నుంచి భారాసగా మారిన లక్ష్యం నెరవేరుతుందా. దేశ వ్యాప్తంగా  పార్టీ గుర్తింపు పొందుతుందా లేదా.. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ప్రజలు తమ ఓటు హక్కుతో నిర్ణయిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr

సంబంధిత వార్తలు: