రాహుల్‌ జోడోయాత్ర.. క్లైమాక్స్ అదిరిపోతుందా?

రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్ర ముగింపు దశకు వచ్చింది. ఇది కాశ్మీర్లో జరగనుంది. ఈ సమావేశానికి 24 పార్టీలు రానున్నాయి. కాశ్మీర్ పండితుల ఊచకోత జరిగిన సమయంలో నిఘా అధికారిగా ఉన్న వ్యక్తి రాహుల్ గాంధీని కలవడం ఇక్కడ విశేషం. గతంలో జరిగిన నోట్ల రద్దుకు సంబంధించి కొన్ని విషయాలు బహిర్గతం అవుతున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రిగా చేసిన పీ చిదంబరం అతని దగ్గర ఉండే అధికారి కలిసి చేసిన నిర్వాహకమే నోట్ల రద్దు కారణమని తెలుస్తోంది. నోట్ల రద్దు చేయడం వల్ల పాకిస్తాన్ నుంచి ఇండియాకు వస్తున్న నకిలీ కరెన్సీని అడ్డుకోవడంలో భారత్ సఫలీకృతమైంది.

భారత్ కరెన్సీ పాకిస్తాన్ కరెన్సీని తయారు చేసే ఓ వ్యక్తి, ఒకే పేపర్ ఉండటం వల్ల పాకిస్తాన్ అధికారులకు భారత్ లో నకిలీ కరెన్సీని తయారు చేసి చలామణి చేయడం ఈజీగా మారిపోయింది. దీనివల్ల దేశంలో ఎన్నో చోట్ల ఉగ్రవాద దాడులు జరిగాయి. ప్రస్తుతం నోట్ల రద్దు వల్ల దేశంలో తీవ్రవాదం తగ్గిపోయింది. ఉగ్రవాద సంస్థలకు అందాల్సినటువంటి నిధులు అందకుండా పోయాయి. పాకిస్తాన్ మరియు జమ్ము కాశ్మీర్ లోని కొంతమంది వేర్పాటు వాదులు జమ్ము కాశ్మీర్లో 370 అండ్ 35 ఆర్టికల్ పునరుద్ధరించాలని అక్కడ ఉండే వారికి స్వేచ్ఛను ప్రసాదించాలని వాదిస్తున్నారు.

దేశంలో ఎలాంటి పరిస్థితి ఉందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. దేశం మొత్తం మీద ఎక్కడ కూడా ఉగ్ర దాడి జరగడం లేదు.. ఎందుకు 370 ని పునరుద్ధరించాలని అడుగుతున్నారు. కొంతమంది వ్యక్తులు  దేశంలో దాడులు జరగాలని కోరుకుంటున్నారా? రాహుల్ గాంధీ యాత్ర ముగింపు సభలో 24 పార్టీలు ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. 370 ఆర్టికల్ పై కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తాయో... అక్కడ ఉండే లోకల్ పార్టీల స్పందన ఎలా ఉండనుందో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: