జగన్‌కు ఆ నిర్ణయం అతి పెద్ద మైనస్‌ కాబోతుందా?

ఒక ఇంట్లో నిన్నటిదాకా పెన్షన్ ఉండి ఈరోజు తీసేస్తే ఎలా? ఒక ఇంట్లో ముగ్గురు కొడుకులు ఉండి ఆ ముగ్గురికి గవర్నమెంట్ ఉద్యోగం ఉండి లేదా వారు ఇన్కమ్ టాక్స్ కట్టిన వారైతే ఆ తల్లిదండ్రులకు పెన్షన్ ఇవ్వడం లేదు. ఇది ఎంతవరకు సబబు ఆంధ్ర ప్రదేశ్ లో ఒక సర్వే ప్రకారం ఒక కోటి 67 లక్షల కుటుంబాలు ఉన్నాయి. అయితే ఇందులో ఎంత మందికి పెన్షన్ వస్తుంది. ఇందులో ఎంత మంది ఇన్కమ్ టాక్స్ కడుతున్నారు. ఇలా కొంతమంది పెన్షన్ తీసేయడం వల్ల వారు కొంత ఇబ్బందికి గురవుతున్నారు.

కొడుకులు ఎంత ప్రజల్లో ఉన్నా వారు ఏ ప్రాంతంలో ఉన్నా ఈ వృద్ధు లకు వచ్చే పెన్షన్ తీసివేయడం వల్ల వారు తమ హక్కును కోల్పోయినట్టుగా భావిస్తున్నారు. ఉదాహరణకు ఒక కొడుకుకు కారు ఉంటే ఆ కారు ఉండడం వల్ల ఆ తల్లిదండ్రులకు పెన్షన్ రావడం లేదు. దీనివల్ల వృద్దులు నష్టపోతున్నారు. గతంలో ఆఫ్లైన్ విధానం ఉండడం వల్ల వాళ్ళ ఇన్కమ్ టాక్స్ కడుతున్నప్పటికీ కూడా తల్లిదండ్రులకు పెన్షన్ వచ్చేది. కానీ ప్రస్తుతం ఆధార్ లింక్ కావడం వలన ప్రతిదీ తెలిసిపోతుంది. తద్వారా వారికీ అందవలసినటువంటి పెన్షన్ ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. దీంతో వృద్ధులు గగ్గోలు పెడుతున్నారు.

దీనివల్ల ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. కుటుంబం కలిసున్నప్పటికీ కూడా వాలంటీరు వచ్చే రాసుకునే సమయంలో వేరువేరుగా రాయించుకోవాలని తద్వారా పెన్షన్ వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇది ఇలా ఉంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఎంతో మంది వృద్ధులు నష్టపోతున్నట్టు వారందరికీ సరైన సమయంలో పెన్షన్ అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అనుకుంటున్నారు. గతంలో చంద్రబాబు హయాంలో ఇలానే పెన్షన్ ఇవ్వాలని భావించారు. అన్ని వివరాలు సేకరించారు. చివరికి జీవో కూడా ఇచ్చారు. రాబోయే రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పెన్షన్ వచ్చే వృద్ధులు ఆశల్లో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: