రాహుల్ జోడో యాత్రకు అద్భుతమైన క్లైమాక్స్ ?

ఈనెల 30న శ్రీనగర్‌లో రాహుల్ గాంధీ జోడో యాత్ర ముగియబోతోంది. ఈ రాహుల్ గాంధీ జోడో యాత్ర ముగింపు సభను అద్భుతంగా నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. భారత్‌ జోడో యాత్ర ముగింపు సభకు హాజరుకావాల్సిందిగా పలు పార్టీల నేతలను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆహ్వానిస్తున్నారు. భావసారూప్యత గల 21 పార్టీల నేతలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రత్యేకంగా లేఖ రాశారు. ఈనెల 30న శ్రీనగర్‌ చేరుకుంటుందని, 3300 కి.మీ పాదయాత్ర ముగుస్తుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే లేఖలో పేర్కొన్నారు.

ప్రస్తుతం దేశం... ఆర్ధిక, సామాజిక, రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో... పార్లమెంటులో, మీడియాలో ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే లేఖలో రాశారు. ఆ నేపథ్యంలోనే... ప్రజలకు నేరుగా దేశ పరిస్థితులు వివరించి.. అందరినీ ఏకం చేయడం కోసం భారత్‌ జోడో యాత్ర కృషి చేస్తోందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అంటున్నారు. 3300 కి.మీ యాత్రలో... ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, సామాజిక విభజన, ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీన పరచడం, సరిహద్దుల్లో పెరుగుతున్న ముప్పు వంటి అంశాలపై జోడో యాత్రలో రాహుల్ లేవనెత్తారని గుర్తు చేశారు.

యువత, మహిళలు, రైతులు, కార్మికులు, చిరు వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు, దళితులు, ఆదివాసీలు, మతపరమైన మైనారీటీలు, భాషా పరంగా, ఉద్యమకారులు, కళాకారులు, ఆధ్యాత్మిక వేత్తలు ఎదుర్కొంటున్న అంశాలపై దేశ వ్యాప్త చర్చకు ఈ యాత్ర ద్వారా శ్రీకారం చుట్టినట్లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే  పేర్కొన్నారు. యాత్ర ప్రారంభంలో... భావసారూప్యత గల ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునివ్వగా.... పలు పార్టీల ఎంపీలు, నేతలు, మేథావులు, ప్రజలు హాజరైయ్యారు.

ఈ యాత్ర ముంగిపు కార్యక్రమాన్ని జాతిపిత మహాత్మాగాంధీకి అంకితం చేస్తున్నట్లు పార్టీల నేతలకు రాసిన లేఖలో తెలిపిన మల్లిఖార్జున ఖర్గే... ప్రస్తుత పాలకులు... ప్రజా సమస్యలను ఒక పద్దతి ప్రకారం పక్కదారి పట్టించారని, ఇందుకు దేశంలో ద్వేషం, హింస పెంచిపోషిస్తున్నారన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: