మన జీవితాల్లో ఈ మార్పులు మంచికేనా?

ఎంత డబ్బు సంపాదించినా మనం ఎంత ఖర్చు పెట్టాలో అంతే ఖర్చు పెట్టాలి. డబ్బు ఎక్కువ సంపాదించే కొద్దీ సౌకర్యాలు కూడా ఎక్కువ అవసరం అవుతూ ఉంటాయి. గతంలో మనకు ఆకలేస్తే ఇంట్లో  అన్నీ  మనకి అమ్మే వండి పెట్టేది. హోటల్స్ కి వెళ్ళే వాళ్ళం గానీ కొంచెం తక్కువ. కానీ ఇప్పుడైతే ఏదైనా హోటల్ కి వెళ్లి తింటున్నాం లేదంటే ఇంటి దగ్గరికే జొమోటో నుంచో లేదంటే ఇంకేదైనా  ఫుడ్ డెలివరీ కంపెనీ నుంచో తెప్పించుకుని తింటున్నాం.

ఇప్పుడు తలంటుకోవడానికి, పౌడర్ రాసుకోవడానికి కూడా బద్దకం వచ్చి  దానికి కూడా బ్యూటీ పార్లర్ కి వెళ్తున్నారు చాలామంది. ఇల్లు శుభ్రం చేయడం దగ్గర నుంచి గతంలో మనం చేసే పనులు కూడా ఇప్పుడు కొన్ని ఎలక్ట్రికల్  పరికరాలు చేసేస్తున్నాయి. చాలా వరకూ మనకు ఇప్పుడు ఏ అవసరం వచ్చినా ఏదో ఒక ఎలక్ట్రికల్ పరికరం తోనో లేదంటే వేరే మనుషులతోనో చేయించేస్తున్నాం. కానీ మనం చేయడం లేదు. వంట మనిషి, చాకలి ఇలా మన అవసరాన్ని బట్టి రకరకాల మనుషులతో పనులు చేయించేస్తున్నాం.

ప్రస్తుతం  ఎంత సంపాదించినా మంచి నీళ్లలా ఖర్చు అయిపోతున్నాయి. ఎందుకంటే మనకు ఒక వైపు ఆదాయం పెరిగింది.. దానితోపాటు వృత్తి నిర్వహణలో భాగంగానో లేదా మరొక కారణముతోనో అలసత్వం కూడా పెరిగింది. దాంతో గతంలో తక్కువ ఖర్చుతో మన ఇంట్లో మనం చేసుకునే పనులకు కూడా  ఇప్పుడు డబ్బు ఖర్చు పెట్టేయడం వల్ల ఎంత సంపాదించినా సరిపోవడం లేదు. ఇంకా మొబైల్స్ వాడేవాళ్లలో 49% మంది జనాలు షార్ట్ మెమరీ తోనూ, 57%డీప్ థింకింగ్ లతోనూ ఇబ్బంది పడుతున్నారని సెంటర్ ఫర్ అటెన్షన్ కింగ్ కాలేజ్ లండన్ స్టడీస్  తేల్చింది. ముఖ్యంగా అయిన దానికి కాని దానికి కూడా మొబైల్ పైన, టెక్నాలజీ పైనా ఇంకా పక్క వారి పైనా ఆధారపడిపోతున్నాం. ఒకరకంగా చెప్పాలంటే ఇప్పుడు మన జీవితాన్ని మనమే మన చేతుల్లో నుంచి తప్పించేశాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: