జీవో నెం.1 పై చంద్రబాబు న్యాయ పోరాటం ఫలిస్తుందా?

మొన్న కందుకూరులో ఎనిమిది మంది మృత్యువాత పడిన సంఘటన.. ఇంకా గుంటూరులో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకొని..దాని ప్రకారం ఇప్పుడు జనాల దగ్గరికి నాయకులను రావడానికి ఏర్పాటు చేస్తారా.. లేకపోతే జనాలను ఒక చోట కలెక్ట్ చేసి బహిరంగసభలకు అనుమతినిస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా కోర్టుకు సంబంధించి కొన్ని కేసుల తీర్పులు ఆసక్తి కలిగించినా, కలిగించకపోయినా, అసలు  పెద్దగా ఆసక్తి కలిగించని విషయాల్లో కూడా ఇప్పుడు అందరికీ ఆసక్తి కలిగించే విషయం ఏంటంటే జీవో నెంబర్1.

తాజాగా బహిరంగ సభలు, రోడ్ షో ల విషయంలో జారీ వేసిన జీవో నెంబర్1 అందరిలోనూ ఆసక్తి కలిగిస్తుంది. గతంలో సుప్రీం కోర్టు  బహిరంగ సభలు లాంటివి జనాలకు ఇబ్బంది కలిగించని ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలని  తీర్పు ఇచ్చింది. కానీ అదే న్యాయస్థానాలు రైతు దీక్షల పేరుతో ఏళ్లకు తరబడి ఒకే ప్రదేశంలో కూర్చుంటే విచిత్రంగా వారిని వదిలేశాయి.  హైవేలు రైల్వే లైన్లను  ఆపితే, అది మన దేశ వ్యవస్థని అతలాకుతలం చేసే కుట్ర. వాటిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టండి అని చెప్పిన సుప్రీం కోర్టు ఒకసారి మాత్రం దానికి కాంట్రాస్ట్ తీర్పునిచ్చింది.

గతంలో అమరావతి  విషయంలో ఇచ్చిన తీర్పు సందర్భంలో పబ్లిక్ కి అసౌకర్యం కలగకూడదు మీరు 600 మందికి అడిగారు కాబట్టి 600 మందికే మీటింగ్ పెట్టుకోండి అని చెప్పిన సుప్రీంకోర్టు ఇప్పుడు ఎటువంటి తీర్పునిస్తాయి. అప్పుడు ఇచ్చిన తీర్పు రాబోయే కాలంలో కూడా వర్తిస్తుందా లేదా ఇప్పుడు జనాల్లోకి వెళ్లేందుకు నాయకులకు అనుమతినిస్తారా లేదంటే బహిరంగ ప్రదేశాలు విశాలమైన ప్రదేశాల్లో కి ప్రజలను అనుమతినిస్తారా.. రాజకీయ ఉపన్యాసాల కోసం అనేది తేలాల్సింది. ఇప్పుడు ఇదే కోర్టులో నలుగుతున్న విషయం. దీని తీర్పు కోసం అందరూ అన్ని పార్టీలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సందర్భం ఇది. మరోసారి సభలు, ప్రసంగాల పేరుతో ఎటువంటి దుర్ఘటనలు జరగకుండా ఉండాలంటే కోర్టు ఇప్పుడు దానికి సరిపోయే తీర్పును ఇవ్వాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: