చంద్రబాబుకు, జగన్‌కు ఉన్న తేడా ఆ ఒక్కటే?

ఓటుకు కోట్లు అనే విషయంపై చంద్రబాబు నాయుడు అప్పుడు భయపడకుండా.. ఏం చేస్తారో చేసుకోండి అన్నట్టుగా ఉంటే.. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి సంబంధించి సెక్షన్ 9 సెక్షన్ 10 కు సంబంధించిన ఆస్తులు కోర్టులతో పోరాడి మరీ ఆయన తిరిగి సాధించేవారు. ఆయనకు ఆ సత్తా ఉంది ఎందుకంటే తెర వెనుక రాజకీయం చేయడం, డైవర్ట్ చేయడం ఆయనకు చాలా సులువు.. ఆవేశంగా ప్రసంగాలు కూడా ఇస్తారు.. కానీ తెర ముందు సమస్య వస్తే దాన్ని కంట్రోల్ చేయలేరు.

అంటే చంద్రబాబు ప్రచారంలో  బెస్ట్ గాని వ్యూహాన్ని అమలు చేయడంలో మాత్రం తడబడతారన్న వాదన ఉంది. అదే ఆయనకున్న బలహీనతగా చెబుతారు. గతంలో ముద్రగడ పద్మనాభం నిరాహార దీక్ష విషయంలో చంద్రబాబు నాయుడు ఆయనతో మాట్లాడడానికి తన టీం  ను పంపించారు. కానీ అక్కడ చర్చలు విఫలం ఇవ్వడంతో  తెర ముందు జరిగిన పని ఆయనను అరెస్టు చేయడం అయింది. అదే ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో నిరాహార దీక్ష చేస్తున్న హరిరామ జోగయ్య గారి దీక్షనైతే భగ్నం చేసి హాస్పిటల్ లో పెట్టారు గాని ఆయనతో చర్చలకు మాత్రం జగన్ దిగలేదు.

చంద్రబాబు కాస్త భయస్తుడు, ఆ భయమే ఆయనను దెబ్బతీస్తుంది అని ఆయన మానస పుత్రుడు వంటి ఏబీఎన్‌ ఛానల్‌ ఎండీ రాధాకృష్ణ కూడా చెబుతుంటారు. ఆయన మాటల్లో కూడా కొంత నిజం ఉంది.చంద్రబాబు నాయుడు ఏ భయంతోటి అయితే కొన్ని తెర ముందు వ్యూహాలు అమలుపరచడానికి భయపడతారో దానికి విరుద్ధంగా జగన్ అదే భయంతో మంచి పనులు చేస్తారు.  అంటే ప్రజలకు ప్రజాస్వామ్య బద్దంగా జవాబుదారీగా ఉండాలని అనుకుంటారు. అదే జగన్‌కు మేలు చేస్తుంటుంది.

ఒక్కమాటలో చెప్పాలంటే.. ఆ ధైర్యమే చంద్రబాబు, జగన్‌లకు ఉన్న ప్రధాన బేధంగా చెప్పొచ్చు. జగన్ తాను నమ్మితే చాలు.. ఎలాంటి చర్యలకైనా వెనుకాడబోరు. వ్యూహాల కన్నా చర్యలకే జగన్‌ ప్రాధాన్యం ఇస్తారు. పర్యవసానం ఎలా ఉన్నా.. ముందడుగే వేస్తారు. ఇప్పటి వరకూ అది లాభిస్తూనే వచ్చింది. ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: