కాపు రిజర్వేషన్లపై పవన్‌, చంద్రబాబు నోరు విప్పరా?

ఇప్పుడు ఏపీలో అధికారం కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లు తాము రాజకీయాల్లోకి వస్తే కాపులకురిజర్వేషన్ ఇస్తారా? ,అది కూడా బీసీలను కలిపి 50% లోపు ఇస్తారా లేదా ఈడబ్ల్యూసిలో చెప్పినట్టు 5% ఇస్తారా.. అనే విషయంపై క్లారిటీ ఇవ్వాలి. ఇస్తామన్న తెలుగుదేశం ఇస్తే 50% కన్నా తక్కువే ఇవ్వాలి కానీ 50% ఇవ్వడానికి లేదు. తమిళనాడులో ఇచ్చారు కదా అని మొదలు పెట్టినా కోర్టు కొట్టేస్తుంది. రాజశేఖర్ రెడ్డి హయాంలో ముస్లింలకు 5% రిజర్వేషన్ ఇస్తే కోర్టు దాన్ని 4% కి మార్చి ఇచ్చింది. అది కూడా కులాల వారిగా బీ.సీ-ఈ ఇచ్చింది. అదే బీ.సీ -ఎఫ్ ఇవ్వాలంటే అందులో ఉన్న ఇతర కులాలను తగ్గించాలి.

బీసీలుగా కాపులకు అర్హత ఉంది, వాళ్ళు చాలా కాలంగా ఇబ్బంది పడుతున్నారు అనే నివేదిక ప్రకారం  బీసీలనుంచి ఇవ్వాలి.  అది ఇవ్వడానికి బీసీలు ఒప్పుకోరు. ఈ కారణంగానే గతంలో చంద్రబాబునాయుడు ఓడిపోతే, జగన్ గెలిచారు.  కేంద్రం  ఆ రిజర్వేషన్ విషయాన్ని  రాష్ట్రాలకి   వదిలేసిందని   5% ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ చెల్లుబాటు అవుతుందని జీవీఎల్ నరసింహారావు చెబుతున్నారు. కానీ  రాష్ట్ర ప్రభుత్వం ఆ5% ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ ని ఇవ్వడానికి వీలు లేకుండా కొట్టిపడేసింది.

బీసీల్లో వర్కౌట్ అవ్వకపోయేసరికి మోడీ ఇచ్చిన ఈడబ్ల్యూఎస్‌ లో5% అంటూ చంద్రబాబునాయుడు ఇచ్చిన జీవో చెల్లుబాటు అవుతుంది అని చెప్తే, అప్పటికే దాన్ని కొట్టి వేశారు కాబట్టి దాన్ని మళ్ళీ ఇవ్వమని  జీవీఎల్  అంటున్నారు. వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ దాని పైన ఎటువంటి అభిప్రాయం తెలపలేదు. జీవీఎల్ చెప్పేదంతా పైపై మాటలేనని కూడా చెప్తుంది ‌. కాపుల రిజర్వేషన్ కోసం నిరాహార దీక్ష చేస్తున్న హరి రామ జోగయ్య దీక్షను భగ్నం చేసి ఆయన్ను హాస్పిటల్ కి తీసుకువెళ్లారు . ప్రభుత్వం తరఫున ఆయన దగ్గరికి ఎవరినైనా పంపించి మాట్లాడండి అని  పవన్ కళ్యాణ్ కూడా అడుగుతున్నారు. కానీ ప్రభుత్వం ఎవరినీ ఆయన దగ్గరికి పంపించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: