ఇక జగన్‌కు ముందుంది మొసళ్ల పండుగేనా?

వైఎస్‌ జగన్‌ది వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరాటం కాబోతుంది. గత ఎన్నికల ముందు జగన్‌కు  తోడుగా వైఎస్ విజయమ్మ, షర్మిల కూడా ప్రచారం చేశారు.  కానీ ఇప్పుడు జగన్ ఒంటరిగా పోరాడబోతుంటే.. తెలుగు దేశం పార్టీ తరపున ముగ్గురు అంటే లోకేష్, చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, ఇంకా జనసేన నుండి పవన్ కళ్యాణ్.. ఇలా నలుగురు కసిగా ఆయనకు ఎదురుపడబోతున్నారు. మరొక పక్క ఎమ్మెల్యేల్లో కొంత మందిని జగన్ తీసేయబోతుండడంతో వారందరూ భారీ ఎత్తున అసమ్మతి వ్యక్తం చేయబోతున్నారు. ప్రత్యేకించి రఘురామ కృష్ణంరాజు, ఆనం రామ నారాయణ లాంటి వ్యక్తులు  ఈ జాబితాలో ఉన్నారు.

ప్రభుత్వ ఉద్యోగుల తరఫు నుండి కూడా జగన్ వైపు చూసే వాళ్ళు ఈఎన్నికల్లో చాలా తక్కువ మందే ఉంటారు అని తెలుస్తుంది. అటు పోలీస్ శాఖ నుండి కూడా అదే వ్యతిరేకత ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఈ రెండు శాఖల నుండి అయితే తీవ్ర వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది. అది ప్రతిపక్షానికి బాగా కలిసి వచ్చే అంశమే. ఒక పక్క సంక్షేమాలను పొందుతున్న ప్రజలలో కూడా సంతృప్తి లేదు. పెంచుకుంటూ పోతామన్నారు కాబట్టి 2,700 ఇచ్చే వారికి, వచ్చే ఏడాది 3,000 ఇస్తారా. ఈసారి ఎలక్షన్లలో నెగ్గితే 5000 కు పెంచుతారా అని వాళ్ళ ఎమ్మెల్యేలను అడుగుతున్నారు ప్రజలు.

అమ్మ ఒడి , విద్యాదీవెన పొందే వాళ్ళ గొడవ ఎలా ఉన్నా అది  రాని ప్రజల నుంచి.. వారు ఇంకొక పథకాన్ని పొందుతున్న వారైనా సరే అసంతృప్తి వ్యక్తమవుతోంది. వారు కూడా ఒక 30% వరకు ఎదురు తిరిగే అవకాశం ఉంది. జగన్‌కు సంబంధించిన సోషల్ మీడియాలో లేదా సాక్షి ఛానల్ లో కనిపించే రాష్ట్ర అభివృద్ధి కాకుండా, తెలుగుదేశం పార్టీ లేదా జనసేన పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో పోస్టులను  చేస్తే నిజంగా రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందుతుందో తెలుస్తుంది. సోషల్ మీడియాను, వార్తలను నిత్యం ఫాలో అయ్యే తటస్థ జనాలు కూడా జగన్ పై వ్యతిరేకతను చూపే అవకాశం ఉంది. మరి జగన్ ఎలా జాగ్రత్త పడతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: