చంద్రబాబును చూసి జగన్‌ ఇది తప్పకుండా నేర్చుకోవాలి?

తెలుగుదేశం దగ్గర ఉన్న గొప్ప గుణం ఏంటంటే తన వారికి కష్టం వస్తే కడుపులో పెట్టుకుని  కాపాడుకుంటుంది. అలాగని నష్టపోయేవాడు నష్టపోతాడు అది ఒక అంతర్గత వ్యవహారం. తెలుగుదేశం కార్యకర్తలకు కష్టం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గాని లోకేష్ గాని అప్రమత్తమై వెంటనే ఆదుకునే విషయంలో ముందంజలో ఉంటారు. ఉదార హృదయం కలిగిన వాళ్లు తెలుగుదేశం పార్టీలో ఎక్కువ మందే ఉన్నారు. వాళ్ళందర్నీ ఇలాంటి సందర్భంలో సంఘటితం చేసి వారు కూడా సహాయం చేయడానికి ముందుకు వచ్చేలా చూడడంలో కూడా తెలుగుదేశం అధినేత ఎప్పుడు ముందంజలోనే ఉంటారు.

ఇటీవల కందుకూరు ఘటనలోనూ ఇదే జరిగింది. చంద్రబాబు నాయుడు మొదటగా10 లక్షల సహాయాన్ని ప్రకటించి దాని 15 లక్షలు చేశారు కానీ ఇప్పుడు  23 లక్షల వరకు ఆ సాయం అనేది పెరిగింది. ఆ పార్టీలో ఉన్న వివిధ సంస్థలను నడుపుతున్న ధనవంతులైన నాయకులు ఒక్కొక్కరు మృతుల పేరున ఇంతింత అని సహాయాన్ని ప్రకటించారు. వీటితోపాటు కేంద్ర ప్రభుత్వం కొంత రాష్ట్ర ప్రభుత్వం మరికొంత సహాయాన్ని ప్రకటించింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు దగ్గరుండి అంత్యక్రియల వ్యవహారం చూడటమే కాకుండా ఇప్పటివరకు ఆ పార్టీ నాయకుల నుండి అందుతున్న సహాయం అయితే 24 లక్షల వరకు పెరిగింది.

ఆ పార్టీకి సంబంధించి ఇంటూరి నాగేశ్వరరావు 8మందికి ఒక్కొక్కళ్ళకు- తలా లక్ష రూపాయలు, ఇంటూరి రాజేష్ -తలా లక్ష రూపాయలు, శిస్ట్లా లోహిత్ -తలా లక్ష రూపాయలు, బేబీ నాయన -తలా 50వేల రూపాయలు , కేశినేని చిన్ని - తలా 50వేల రూపాయలు, కంచర్ల సుధాకర్ - తలా 2లక్షల రూపాయలు, కంచర్ల శ్రీకాంత్ -తలా లక్ష రూపాయలు, అబ్దుల్ అజీజ్ - తలా 50వేల రూపాయలు ,
కోతుల రామారావు -తలా 50వేల రూపాయలు, కొడవాటి సుధాకర్ - తలా 50వేల రూపాయలు .. ఇలా చాలా మంది ముందుకొచ్చారు. ఇలా 24 గంటలు దాటకుండానే 24 లక్షల రూపాయలు సాయాన్ని అందించడం  తెలుగుదేశం నాయకుల యొక్క ఔదార్యానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: