కరోనా చుట్టుముడుతున్నా చైనా ధైర్యం అదేనా?

చైనాలో కరోనా మరణ మృదంగం వాయిస్తోంది. ఇప్పుడు వాళ్ళని కాపాడడం  కూడా చాలా కష్టం . దానికి అసలైన కారణం వాళ్ళలో ఉండాల్సిన హెర్డ్ ఇమ్యూనిటీ లేకపోవడమే . పర్యావసానంగా మృతదేహాలతో హాస్పిటల్ బెడ్లు నిండిపోయి..మృతదేహాలని రోడ్ల మీద పెట్టేసే పరిస్థితి అక్కడ నెలకొంది. మృత దేహానికి అంత్యక్రియల కోసం టోకెన్ ఇస్తే 12 రోజులు  వాళ్ల మనుషులు పక్కనే ఉండి మృతదేహాన్ని చూసుకోవాల్సిన పరిస్థితి. అది కూడా కరోనా మరణం కావడంతో  కరోనా బారిన పడుతూ  చుట్టుపక్కల ఉండేవారుకూడా చనిపోతున్నారు. ఇప్పుడు చైనాలో జనాలు కరోనాతో పిట్టల్లా రాలిపోతున్నారు. అక్కడ సోషల్ మీడియాలో ఒక వార్త పెట్టాలంటే అది ప్రభుత్వ  మీడియా ద్వారా మాత్రమే పెట్టాలి.

ప్రైవేట్  సోషల్ మీడియా ద్వారా ఇటువంటి వార్త ఏదైనా పెడితే అక్కడ ప్రభుత్వం వెంటనే డిలీట్ చేసేస్తుంది. ఆ తర్వాత వాళ్ళని అక్కడ ప్రభుత్వం వెంటనే అరెస్టు చేస్తుంది. కాల్చిపడేసినా  ఆశ్చర్యపోనక్కరలేదు . ఎందరు చనిపోయినా  వాళ్ళను మానవ హక్కుల వాళ్ళు లేదా పౌర హక్కుల వాళ్ళు ఇలా  ఎవరూ వాళ్ళని అడిగేవాళ్ళు లేరు. కరోనాని ప్రపంచదేశాల పై వదిలిన చైనాను అమెరికా లాంటి దేశాలు కొన్ని విషయాలలో చూసీ చూడకుండా వదిలేస్తున్నాయి. చైనాలోనే  వాళ్ళు ఇండస్ట్రీలు నడుపుతున్నారు కనుక చీఫ్ గా లేబర్ దొరికే చైనాను వదులుకోవడం ఇష్టం లేక..అలా చేస్తున్నారు.

అమెరికాలో వర్కర్స్‌కు ఒక్కొక్కరికి 10వేల డాలర్లు పే చెయ్యాల్సి వస్తుంటే చైనాలో అదే అమౌంట్ కి  20మంది వస్తారు. క్వారంటైన్ నిబంధనలు ఎత్తేసిన తర్వాత చాలా దేశాల జనాలు అక్కడున్న వాళ్ళ వ్యాపారాలు పాడవకుండా ఉండడం కోసం, మాస్కులు, శానిటైజర్లు వేసుకుని మరీ చాలా జాగ్రత్తగా చైనా కు వెళ్తున్నారు. రెండు సంవత్సరాల కఠిన నిర్బంధం తర్వాత  చైనాలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోవడంతో వరల్డ్  హెల్త్ ఆర్గనైజేషన్ కూడా జలుబు, దగ్గు లాంటి కరోనా లక్షణాలు ఉంటే టాబ్లెట్ వేసుకుని తిరిగేయ్యండని చెప్తుంది. చైనా అయితే ఆ పని చెప్పక ముందే చేసేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: