బీఎల్‌ సంతోష్‌ వచ్చేటప్పటకి లైన్‌ క్లియర్ చేసేశారు?

హైదరాబాద్ వేదికగా బీజేపీ పార్లమెంట్ విస్తారక్ ల శిక్షణ తరగతులు ఇవాళ్టి నుంచి హైదరాబాద్‌లో జరగబోతుతన్తనాయి. నేటి నుంచి రెండు రోజుల పాటు శామీర్ పేటలోని ఓ రిసార్ట్ లో ఈ శిక్షణ తరగతులు జరగబోతున్నాయి. 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కు చెందిన 87 మంది పార్లమెంట్ నియోజక వర్గాల విస్తారక్ లు ఈ శిక్షణ తరగతులకు హాజరుకానున్నారు. ఈ విస్తారక్ లనుద్దేశించి వర్చువల్ గా కమల దళపతి జేపీ నడ్డా ప్రసంగిస్తారు.

ఈ శిక్షణ తరగతులకు బీఎల్ సంతోష్, జాతీయ ప్రధాన కార్యదర్శులు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, వినోద్ తవ్డే, జాతీయ సంస్థాగత సహా ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్ వంటి వారు హాజరుకాబోతున్నారు. ఇవాళ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, చేరికల కమిటీతో సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ సమావేశంకానున్నారు. పార్టీలో చేరికలు సంస్థాగత అంశాలపై వీరు చర్చిస్తారు. మధ్యాహ్నం రెండు గంటలకు విస్తారక్ ల శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయి. రేపు మధ్యాహ్నం బీజేపీ తెలంగాణ అసెంబ్లీ ఇంఛార్జిలు, కన్వీనర్ లు, విస్తారక్,పాలక్ ల సమావేశం ఉంటుంది.

మొత్తానికి ఈ సమావేశాలకు బీఎల్‌ సంతోష్‌ హాజరుకావడంపై ఆసక్తి నెలకొంది. నిన్న మొన్నటి వరకూ బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీఎల్‌ సంతోష్‌ విచారణను ఎదుర్కోవాల్సి ఉండేది. బీఎల్‌ సంతోష్‌ను విచారించాలని తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసింది. కానీ.. బీఎల్‌ సంతోష్ మాత్రం విచారణకు హాజరు కాలేదు. చివరకు బీఎల్‌ సంతోష్‌ను తెలంగాణ సర్కారు వేసిన సిట్‌ విచారించకుండానే ఆ సిట్‌ రద్దయిపోయింది.

అయితే.. విచారక్‌లు కార్యక్రమం షెడ్యూల్ ముందే ఖరారైనందువల్ల బీఎల్‌ సంతోష్ హైదరాబాద్ వస్తే తెలంగాణ పోలీసులు అరెస్టు చేస్తారా అన్న ఉత్కంఠ నిన్న మొన్నటి వరకూ ఉండేది. కానీ.. ఇప్పుడు సిట్ రద్దయిపోవడం.. కేసును సీబీఐకి అప్పగించడంతో బీఎల్ సంతోష్‌ హైదరాబాద్ వచ్చేందుకు లైన్ క్లియర్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: