కరోనాతో చైనా ఎంత ఘోరంగా దెబ్బతింటోందంటే?

ఆర్థికంగా అగ్రశ్రేణిలో ఉన్న చైనా తను చేసిన తప్పిదాల కారణంగా.. అథః పాతాళంలోకి పడిపోతుంది. ప్రపంచ దేశాలను భయపెట్టాలనో లేదా మరో కారణంతోనో..  ప్రపంచ దేశాల వినాశనం కోసం తన ల్యాబ్ లో తయారుచేసిన  కరోనా వైరస్ ఇప్పుడు తననే కబళించేయాలని చూస్తుంది. దాంతో చైనా ఇప్పుడు తన తవ్విన గోతులో తానే పడినట్టు అయ్యింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు బాసటగా ఉంటూనే రష్యా నుండి ఆయిల్ ని పొందుతున్నా, ప్రపంచ దేశాలతో దానికి ఉన్న గొడవల వల్ల గానీ, కరోనా సందర్భంగా పెట్టిన ఆంక్షల వల్ల గాని దానితో సత్సంబంధాలు లేవు.

అంతేకాకుండా తన దేశంలో వృద్ధుల సంఖ్య (ఏజింగ్ పాపులేషన్ ఫోర్స్) పెరిగిపోవడం కూడా చైనాకు భవిష్యత్తులో కలిసి వచ్చే అంశం కాదు. అక్కడ వర్కర్స్ కోసం చేసిన ప్రత్యేకమైన చట్టం హైలీ ప్రొటెక్షనిస్ట్ ట్రేడ్ పాలసీ కూడా అక్కడ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసే అవకాశం ఉంది. జిడిపిలో 30% ఉండే రియల్ ఎస్టేట్ రంగంతో పాటు డొమెస్టిక్ సెక్టార్లు కూడా అక్కడ బాగా దెబ్బతిన్నాయి.అది మాత్రమే కాకుండా కరోనా సంక్షోభం ఇంకా యుద్ధ  సంక్షోభం కారణంగా బయట దేశాలకు ఇచ్చిన 52 ట్రిలియన్ డాలర్ల అప్పు ను వారు తిరిగి చెల్లించలేని పరిస్థితి నెలకొంది.

 జపనీస్ సెంటర్ ఫర్ అకాడమిక్ రీసెర్చ్ నివేదిక ప్రకారం టెక్ సెక్టార్ 1.5 ట్రిలియన్ డాలర్స్ పతనమవ్వడం ద్వారా ప్రైవేట్ బిజినెస్ సపోర్ట్ దెబ్బ తింది .  బిలియన్స్ డాలర్లు పెట్టుబడులు పెట్టబోయే వ్యాపార పారిశ్రామిక వేత్తలు తమకు సరైన లాభాలు ఉండకపోవచ్చునే ఉద్దేశంతో దేశాన్ని వదిలి వెళ్లిపోవడమే దీనికి కారణం. దీని వల్ల 43 బిలియన్స్ డాలర్ల పెట్టుబడులు కూడా వారితో పాటే బయటికి వెళ్లిపోతున్నాయి. దానికి తోడు అక్కడ రోజువారీగా  విపరీతంగా పెరుగుతున్న కరోనా కేసులు ఆరోగ్య సంక్షోభంను సూచిస్తున్నాయి. దీనికి తోడు చైనాలో జననాల సంఖ్య పడిపోతుండడం కూడా చైనా భవిష్యత్తును అంధకారం చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: