రాహుల్ గాంధీపై మోదీ కరోనాను ప్రయోగిస్తున్నారా?

భారత్ జోడో యాత్ర సందర్భంగా కోవిడ్-19 మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని కోరుతూ కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవ్య కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరియు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌లకు లేఖ రాశారు. రాహుల్ గాంధీకి రాసిన ఈ లేఖపై భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరియు కాంగ్రెస్ మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. దానికి కారణం రాహుల్ యాత్ర లో ఖచ్చితంగా కోవిడ్ -19 మార్గదర్శకాలను అనుసరించడం సాధ్యం కాకపోతే, ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జాతీయ ప్రయోజనాల దృష్ట్యా భారత్ జోడో యాత్రను వాయిదా వేయండని అని లేఖలో పేర్కొవడమే.

దానిపై కాంగ్రెస్ పార్టీ తరపున  శ్రీ రమేష్ మాట్లాడుతూ  “పార్టీ రాజకీయాలు ఆడటానికి ప్రజారోగ్యం చాలా తీవ్రమైన సమస్య.  సమావేశాలకు ప్రోటోకాల్ ఉంటే భారత్ జోడో యాత్ర నిస్సందేహంగా దానికి కట్టుబడి ఉంటుంది  అని తెలిపారు.  పార్లమెంటు సాధారణంగా సమావేశమవుతోంది. అంతర్జాతీయ  విమానాల్లో కూడా ఎక్కడా మాస్క్‌లు తప్పనిసరి అని ఆంక్షలు లేవు. అంతర్జాతీయంగానే కరోనా కు సంబంధించి ఎటువంటి ఆంక్షలు లేనప్పుడు మరి రాహుల్ గాంధీ యాత్ర ఏ విధంగా కరోనా ఉధృతికి కారణం అవుతుంది అనేది పెద్ద ప్రశ్న.

కానీ రాజకీయాలను గమనించే సామాన్య ప్రజలు.. అడగాలనుకునే ప్రశ్న ఏంటంటే గుజరాత్ ఎన్నికల సమయంలో ప్రధాని మోడీ కోవిడ్ ప్రోటోకాల్‌లను అనుసరించారా అని.  పైగా మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి మార్చి 2020లో కోవిడ్ లాక్‌డౌన్ విధించడాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక వారం ఆలస్యం చేసింది కూడా.  ఇక్కడ అర్థం అయ్యే విషయం ఏమిటంటే రాహుల్ గాంధీ  యాత్ర మాండవియాకు ససేమిరా ఇష్టం లేదని. కానీ ప్రజలు  యాత్రను  ఇష్టపడుతున్నారు యాత్రలో చేరుతున్నారు. నిజానికి యాత్రకు వస్తున్న స్పందన చూసి సహించలేని మాండవ్య ప్రజల దృష్టిని మరల్చేందుకు కంగారుగా రంగంలోకి దిగినట్లు కనిపిస్తోంది కరోనా కేవలం పైకి కనిపించే ఒక సాకు మాత్రమే .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: