కాపు రిజర్వేషన్లు.. జగన్ కొంప ముంచుతాయా?

2024 ఎన్నికల్లో.. జగన్  బీసీ , ఎస్సీ, ఎస్టీ ఓట్ బ్యాంకు చేజారకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే  గోదావరి జిల్లాలోని కాపు నేతలకు సీట్లు, ఇంకా ముద్రగడ కుటుంబ సభ్యులను వైసీపీలోకి తెచ్చేందుకు నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగా కాపులకు ఏ విధంగా మేలు చేస్తుందీ ప్రధానంగా ప్రచారం చేస్తున్నారు. ఇదంతా ఎందుకు అంటే సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్‌ ఇచ్చే అధికారం రాష్ట్రప్రభుత్వానికి ఉంది. కానీ గతంలో  టీడీపీ సర్కార్‌  కాపులకు 5 శాతం కేటాయించి విద్యా,ఉద్యోగాల్లో ఊతం ఇస్తే అధికారంలోకి రాగానే జగన్‌ ఆ కోటా రద్దు చేసారు.

అంతేకాకుండా  చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేస్తూ అసెంబ్లీలో బిల్లు ఆమోదించారు.  కాపులకు రిజర్వేషన్ల పట్ల జగన్‌ మొదటి నుంచీ వ్యతిరేకంగా ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు కూడా పలు సమావేశాల్లో కాపులకు రిజర్వేషన్లు తమ పరిధిలో లేవని, దానిపై తాను హామీ ఇవ్వలేనని ఖరాకండిగా చెప్పారు. ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లను రాష్ట్రంలో విద్యాపరంగా మాత్రమే వర్తింపజేస్తూ చట్టం చేశారు. దాంతో ఇప్పుడు డ్యామేజ్‌ కంట్రోల్‌ చేసే పనిలో బిజీగా ఉంది వైసీపీ ప్రభుత్వం.

ఒక పక్క టీడీపీ, ఏపీలోని మెజార్టీ వర్గాల పైన వైసీపీ ఆశలు పెట్టుకోవటం.. కాపు సామాజిక వర్గం ఈ సారి ప్రధానంగా జనసేన వైపు చూస్తోందనే ప్రచారం నడుమ టీడీపీ తమ ఓట్ బ్యాంకు పదిలం చేసుకొనే ప్రయత్నాలు చేస్తోంది. మరొక పక్క పవన్ కొత్త స్ట్రాటజీ తో..పొత్తు సంగతి ఎలా ఉన్నా.. ముందుగా తన పార్టీ బలం పెంచుకొనే పనిలో నిమగ్నమయ్యారు. టీడీపీకి చెప్పుకోదగిన ఓట్ బ్యాంక్ ఉన్నా.. 2019 లో జగన్ అమలు చేసిన సోషల్ ఇంజనీరింగ్ ముందు ఓటమి తప్పలేదు. దీంతో, ఈ రెండు పార్టీలు కలవాలని క్షేత్ర స్థాయిలో రెండు పార్టీల నేతలు కోరుకుంటున్నారు. జనసేన- టీడీపీ పొత్తు ను ఎదుర్కోవడానికి  జగన్ వచ్చే ఎన్నికల్లో మరి ఏ ఎత్తు.. వేయబోతున్నారో

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: