జాగ్రత్త పవన్‌.. ఈ తప్పు చేస్తే ఇమేజ్‌ గోవిందా?

ఎవరికీ కొమ్ముకాయను.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలనివ్వను అని పవన్ కల్యాణ్ పదే పదే చెప్తున్నారు. ఇవి రెండు వేర్వేరు స్టేట్ మెంట్లు. టీడీపీకి సపోర్ట్ చేసింది.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చవద్దని తర్వాత చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వైఎస్ఆర్ సీపీకి, జనసేనకు ఘర్షణ ఏముంది? అసలు గొడవపడుతుంది వైఎస్ఆర్ సీపీ, తెలుగు దేశం పార్టీ. కాంగ్రెస్ తో రహస్య మంతనాలు జరిపి ఆయన్ను జైలుకి పంపారనేది జగన్ కసి. తనను జైళ్లో పెట్టడానికి కారణం తెలుగుదేశం పార్టీ అని జగన్ ఫీలింగ్.

అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ప్రతిపక్ష స్థానంలో ఉన్నా.. తనకు సంబంధించిన 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీని లాక్కుంది. జగన్ పార్టీని భూస్థాపితం చేసందుకు టీడీపీ కుట్ర పన్నింది. ఇలాంటి వాటిని చూసి అధికారంలోకి వచ్చాక జగన్ కూడా ఇదే చేయాలనుకున్నారు. కానీ ఈ రెండు పార్టీల మధ్య గొడవలో పవన్ దూరారు. పవన్ ఏమైనా జగన్ పైనా కేసులు పెట్టించారా అంటే అది కూడా కాదు. అసలు వైఎస్ఆర్ సీపీతో గొడవ తనకు తాను సృష్టించుకున్నారు. మూవీ టికెట్ల విషయంలో నిర్ణయం తీసుకున్నా... అది తనకోసమే తీసుకున్నట్లు పవన్ సృష్టించారు.

ఇప్పటంలోగోడలు కూలితే.. తన మద్దతు దారుల ఇళ్లు కూలాయని మండిపడ్డారు. అసలు ఈ వైఎస్ఆర్ సీపీ-టీడీపీ లొల్లిలో పవన్ ని ఎక్కడా టార్గెట్ చేయలేదు. కాకపోతే తని టార్గెట్ చేశారని చెప్పుకుంటూ విక్టిమ్ కార్డు వాడుకుంటున్నారు. తననే టార్గెట్ చేస్తున్నారన్న యాంగిల్ లో లబ్ధి పొందడం రాజకీయంగా తెలివైన ఎత్తుగడ.. కాకపోతే అమాయక యువతను ఈ ఘర్షణలోకి లాగడం దారుణం. పవన్ కల్యాణ్ సీఎం కావాలని కోరుకోవడం తప్పు కాదు.. కాకపోతే టీడీపీ అధికారంలోకి రావడానికి ఇలా చేస్తున్నారని ప్రచారం. ఇదే వాస్తవమైతే.. పవన్ కు ప్రజల్లో ఉన్న క్రేజ్ పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: