పల్నాడులో ఆ ఇద్దరి హత్యకు బాబు కుట్ర?

టీడీపీ, వైసీపీ వర్గాల ఘర్షణలతో మళ్లీ పల్నాడు వేడెక్కింది. మొన్నటి ఘర్షణ ప్రకంపనలు ఇంకా కొనసాగుతున్నాయి. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిలను అంతమొందించేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నార‌ని మంత్రి అంబటి రాంబాబు అనుమానపడుతున్నారు. ఫ్యాక్షన్ చరిత్ర ఉన్న జూలకంటి బ్రహ్మారెడ్డిని మాచర్ల టీడీపీ ఇన్ చార్జిగా పెట్టడం వెనుక వ్యూహం అదే అన్నారు. జూలకంటి బ్రహ్మారెడ్డి ద్వారా చంద్రబాబు నాయుడు హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాడని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు.

టీడీపీ హత్యా రాజకీయాల ద్వారా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి ప్రాణాలకు ముప్పు ఉందని మంత్రి అంబటి రాంబాబు ఆందోళన వ్యక్తం చేశారు. మాచర్లలో టీడీపీ - వైసీపీ ఘర్షణలో గాయపడ్డ వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలను నరసరావుపేటలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో మంత్రి అంబటి రాంబాబు, ఇతర నేతలు పరామర్శించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. మరో ఇద్దరు వైసీపీ కార్యకర్తలకు తీవ్రగాయాల పాలైనట్లు వైద్యులు మంత్రి అంబటి రాంబాబుకు వివరించారు.

చంద్రబాబు హత్యా రాజకీయాలు, కుట్ర రాజకీయాలను చూస్తూ ఊరుకోమని, వారి ఆటలు సాగనివ్వమని మంత్రి అంబటి రాంబాబు వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యే పిన్నెల్లిని ఓడించే శక్తి సామర్థ్యాలు చంద్రబాబుకుగానీ, ఆయన ఇన్ చార్జీగా పెట్టిన బ్రహ్మారెడ్డికి కానీ లేవని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అందుకే ఎమ్మెల్యే పిన్నెల్లినే అంతమొందించేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నాడని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు.

బ్రహ్మారెడ్డి నేర చరిత్ర ఏమిటో, అతను ఎన్ని హత్యలు చేశాడో మాచర్ల ప్రజలకు తెలుసునని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా,  హత్యా రాజకీయాలు చేసినా, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి కాలి గోరు కూడా పీకలేరని మంత్రి అంబటి రాంబాబు ఛాలెంజ్ చేశారు. ఇదేం ఖర్మ అంటూ.. పల్నాడు ప్రాంతానికి ఇటీవల వచ్చిన చంద్రబాబు.. "నేను కన్నెర్ర చేస్తే పల్నాడులో ఒక్కడు ఉంటాడా..?" అన్నారని మంత్రి అంబటి రాంబాబు గుర్తు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: