పాత రోజులు కావు.. చైనాకు ఇండియా గట్టి వార్నింగ్..?

ఇండియా, చైనా మధ్య మరో సారి ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. అరుణాచల్‌ప్రదేశ్‌ లోని తవాంగ్‌ సెక్టార్‌లో భారత్‌-చైనా సైనికుల మధ్య ఈనెల 9 మరోసారి ఘర్షణ జరిగింది. మన దేశ భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు చైనా దళాలు యత్నించాయి. ఆ చైనా బలగాల దుశ్చర్యను భారత సేనలు దీటుగా తిప్పికొట్టాయి. ఈ సందర్భంగా రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణ నేపథ్యంలో మరోసారి ఇరు దేశాల నేతల మధ్య మాటల యుద్ధాలు మొదలయ్యాయి.

తాజా ఘర్షణపై అరుణాచల్ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పెమా ఖండూ ఘాటుగా స్పందించారు. చైనా సైనికుల దూకుడును భారత సైనికులు సమర్థంగా తిప్పికొట్టాయని అరుణాచల్ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పెమా ఖండూ అన్నారు. ఇదే సమయంలో ఆయన చైనాకు వార్నింగ్ ఇచ్చారు. ఇండియాను తక్కువ అంచనా వేయవద్దని.. ఇది 1962 కాదని చైనా దేశం గుర్తుంచుకోవాలని అరుణాచల్ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పెమా ఖండూ హెచ్చిరించారు.

సరిహద్దుల్లో చైనా సైనికులు నిబంధనలు ఉల్లంఘిస్తే భారత సైనికులు సరైన బుద్ధి చెబుతారని అరుణాచల్ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పెమా ఖండూ అన్నారు. ఘర్షణ చోటు చేసుకున్న తవాంగ్‌ సెక్టార్‌లోని యాంగట్సే తన నియోజకవర్గ పరిధిలోకే వస్తుందని అరుణాచల్ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పెమా ఖండూ తెలిపారు.  ఏటా యాంగట్సే సరిహద్దులో ఉన్న జవాన్లను, సమీప గ్రామాల ప్రజలను తాను కలుస్తుంటానని అరుణాచల్ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పెమా ఖండూ గుర్తు చేసుకున్నారు.

తాను తరచు ఆ ప్రాంతవాసుల బాగోగులు అడిగి తెలుసుకుంటానని అరుణాచల్ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పెమా ఖండూ అన్నారు. 1962 నాటి పరిస్థితులు మళ్లీ పునరావృతం కావని... ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే.. భారత ధీర సైనికులు సరైన బుద్ధి చెబుతారని అరుణాచల్ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పెమా ఖండూ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈనెల 9 నాటి ఘర్షణ ఉదంతాన్ని
మన  భారత్‌ తీవ్రంగా పరిగణిస్తోంది. తాజాగ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తవాంగ్‌ సెక్టార్‌లో జరిగిన చైనా, భారత సైనికుల ఘర్షణ అంశంపై పార్లమెంట్‌లో ప్రకటన విడుదల చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: