విజయసాయిరెడ్డి ఫోన్‌ ఇక దొరకదా?

కొన్ని రోజుల క్రితం వైసీపీ నేత విజయసాయి రెడ్డి ఫోన్‌ పోయిందని తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఆ ఫోన్ ఇంకా దొరకలేదు. అయితే.. దిల్లీ మద్యం స్కామ్‌లో విజయ సాయిరెడ్డికి పాత్ర ఉందని.. ఆ వివరాలు బయటకు రాకూడదనే విజయసాయిరెడ్డి ఫోన్‌ పోయిందని నాటకం ఆడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. దిల్లీ లిక్కర్‌ స్కాంలో విజయసాయిరెడ్టి పేరు ఉందన్న చంద్రబాబు.. విజయసాయి రెడ్టిని తప్పించేందుకే ఫోన్‌ పోయిందని నాటకాలాడుతున్నారన్నారు.

పోలీసులు తలచుకుంటే విజయసాయి రెడ్డి ఫోన్ వెదకలేరా అని ప్రశ్నించిన చంద్రబాబు.. బాబాయిని చంపిన వారిపై చర్యలు లేవని విమర్శించారు. చెల్లిని కార్లో ఉంచి లాక్కెల్లినా జగన్ స్పందించలేదని  చంద్రబాబు మండిపడ్డారు. పోలవరం రాష్ట్రానికి వరం అంటున్న చంద్రబాబు.. తమ హయాంలోనే పోలవరం 72శాతం పూర్తయిందని చెబుతున్నారు. సీఎం రాష్ట్రానికి ఐరన్‌ లెగ్‌లా మారారని.. అసెంబ్లీ సాక్షిగా పోలవరం పూర్తి చేస్తామని.. మాట తప్పారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు.
 
పోలవరాన్ని పూర్తిస్థాయిలో జగన్ నాశనం చేశార్న చంద్రబాబు.. దక్షిణ భారత దేశంలోనే పోలవరానికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. జగన్ రాష్ట్రంలోని వ్యవస్థలను సర్వనాశనం చేస్తున్నారని.. రాష్ట్రంలో తలసరి ఆదాయం తగ్గిపోయిందని.. రాష్ట్రంలో పన్నులు పెరిగాయని  చంద్రబాబు  అన్నారు. ఎమ్మెల్యే కిలారి 33 మంది అధికారులను సస్పెండ్ చేయించారని.. పోలీసులను కూడా భయ పెట్టేలా ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.
 
బార్ల లైసెన్సులకు రూ. 20 నుంచి 30లక్షలు వసూలు చేస్తున్నారన్న చంద్రబాబు.. బర్నబాస్‌ను దారుణంగా హత్య చేస్తే..పోలీసులు కనీసం చర్యలు తీసుకోలేదని విమర్శించారు. తమ హయాంలోనే 85శాతం టిడ్కో ఇళ్లు పూర్తి చేశామని.. ఎన్నికల్లో ఉచితంగా ఇళ్లు ఇస్తామని చెప్పి.. మోసం చేశారని చంద్రబాబు అంటున్నారు. అమూల్ బేబీ పెట్టే కేసులకు భయపడనన్న చంద్రబాబు.. రాజకీయ నాయకులపై సీబీఐ కేసులు ఎక్కువగా ఉన్నది మన రాష్ట్రంలోనే అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: