తెలుగు రాష్ట్రాల్లో కొత్త పార్టీ.. 294 స్థానాల్లో పోటీ?

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే అనేక పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు మరో కొత్త పార్టీ రాబోతోంది. అయితే.. ఇది రాజకీయ ఎంజెండాతో వస్తున్న పార్టీ కాదు.. ఆధ్యాత్మిక ఎజెండాతో వస్తోంది. ఈ పార్టీ ప్రధాన లక్ష్యం గోవుల సంరక్షణ. అందుకే గో సంరక్షణకు పాటుపడే గో రక్షకులకి, గోశాలలు నడిపించే వారినే ఈ పార్టీ అభ్యర్థులగా ప్రకటిస్తుందట.

ఇంతకీ పార్టీ పెట్టేదెవరో చెప్పలేదు కదా.. ఆయనే యుగ తులసి ఫౌండేషన్ ఛైర్మన్‌ శివకుమార్. ఈయన టీటీడీ మాజీ సభ్యుడు కూడా. గో హత్యలు రాజకీయ నాయకుల అండదండలతో జరుగుతున్నాయని, అందుకనే యుగ తులసి పార్టీని స్థాపిస్తామని ఆయన అంటున్నారు.  వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 294 స్థానాల్లో  పోటీ చేస్తారట. గోరక్షకులనే  అభ్యర్థులగా ప్రకటిస్తామని ఆయన తెలిపారు.

గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని తిరుమల తిరుపతి దేవస్థానం గతంలో నిర్ణయం తీసుకుందని యుగ తులసి ఫౌండేషన్ ఛైర్మన్‌ శివకుమార్ చెబుతున్నారు. ఈ  నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఇంత వరకు పట్టించకపోవడం చాలా బాధాకరమని యుగ తులసి ఫౌండేషన్ ఛైర్మన్‌ శివకుమార్ అంటున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక సంఖ్యలో గోవులు హింసకు గురై చంపబడుతున్నయని యుగ తులసి ఫౌండేషన్ ఛైర్మన్‌ శివకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ గోహత్యలను ఆపేందుకు పలు సందర్భాలల్లో యుగ తులసి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేశామని యుగ తులసి ఫౌండేషన్ ఛైర్మన్‌ శివకుమార్ వివరించారు. గోహత్యలు చేసేవారికి రాజకీయ నాయకుల అండదండలు ఉంటున్నాయని యుగ తులసి ఫౌండేషన్ ఛైర్మన్‌ శివకుమార్ తెలిపారు. అందుకనే యుగ తులసి పార్టీని స్థాపించి వీటని అరికడతామని యుగ తులసి ఫౌండేషన్ ఛైర్మన్‌ శివకుమార్ అన్నారు. తమ పార్టీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని యుగ తులసి ఫౌండేషన్ ఛైర్మన్‌ శివకుమార్ ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: